కరీంనగర్

సిరిసిల్ల ఉద్యమానికి టిఆర్‌ఎస్ శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 29: సిరిసిల్ల జిల్లా కోసం సాగుతున్న ఉద్యమంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటంలోకి దిగింది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు, సంస్థలతో జెఎసి ఉద్యమం కొనసాగిస్తుండగా అధికార టిఆర్‌ఎస్ శ్రేణులు తమ వంతుగా పోటీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈమేరకు సోమవారం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ కూడళిలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త బస్ స్టేషన్ నుండి ర్యాలీని ప్రారంభించి గోపాల్‌నగర్, అంబేద్కర్‌నగర్, గాంధీచౌక్, ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించి, సిరిసిల్లను జిల్లా చేయాలని కోరుతూ ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా దీక్షల శిబిరంలో సెస్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకే జిల్లా కోసం ఉద్యమం చేపట్టామన్నారు. సామరస్య పూర్వకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆకాంక్షను మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అందులో భాగంగానే ఈ దీక్షలు ప్రారంభించామన్నారు. కాగా తొలి రోజు దీక్షలలో బొల్లి రాంమోహన్, గుజ్జె దత్తాద్రి, కొమిరె సంజీవ్, మండల బాలరాజు, మామిడాల రమణ, కొక్కుల అంజనేయులు చేపట్టారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు చీటి నర్సింగరావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, పట్టణ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎఎంసి చైర్మన్ జిందం చక్రపాణి, జడ్పీటిసిలు మల్లుగారి నర్సాగౌడ్, తోట ఆగయ్య, జనగామ శరత్‌రావు, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకయ్య, కౌన్సిలర్లు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.