కరీంనగర్

బోసిపోయిన సింగరేణి బొగ్గు గనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, సెప్టెంబర్ 2: కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలచ్చిన పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియాలో విజయవంతమైంది. రామగుండం రీజియన్‌లోని సింగరేణి బొగ్గు గనులు సమ్మెతో బోసిపోయి కనిపించాయి. సింగరేణి యాజమాన్యం సమ్మెకు దూరంగా ఉండాలని పెద్దఎత్తున ప్రచారం చేసినప్పటికీ సార్వత్రిక సమ్మెలో ఆర్జీ-2 పరిధిలోని ఓపెన్ కాస్టులల్లో కొంత మేరకు ఉత్పత్తి జరిగినా మిగతా బొగ్గు గనుల్లో ఉత్పత్తి కానరాలేదు. సింగరేణివ్యాప్తంగా 35 బొగ్గు గనులు, 16 ఓపెన్ కాస్టులు ఉండగా దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో సమ్మె వల్ల కంపెనీకి సుమారుగా 60 కోట్ల వరకు నష్టం వచ్చిన్నట్లుగా తెలుస్తోంది. రామగుండం రీజియన్‌లో 9 బొగ్గు గనులు, 4 ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్‌లు, 2 సిఎస్‌పిలు, వివిధ డిపార్ట్‌మెంట్‌లలో 17వేల మంది కార్మికులు పని చేయాల్సి ఉండగా ఇక్కడ మొదటి షిఫ్ట్‌లల్లో 3019 మంది కార్మికులు విధులు నిర్వహించిన్నట్లుగా సింగరేణి అధికారులు శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఆర్జీ రీజియన్‌లో సుమారుగా ఒక రోజుకు 65వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేపట్టాల్సి ఉన్నప్పటికీ సమ్మె కారణంగా మొదటి షిఫ్ట్‌లో 9,163 టన్నుల బొగ్గు ఉత్పత్తిని తీయగలిగినట్లు అధికారులు చెబుతున్నారు. సమ్మె సందర్భంగా ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్, సిఐటియు, ఐఎఫ్‌టియు, టిబిజికెఎస్ సంఘాలు పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, వై.గట్టయ్య, బి.వెంకట్రావ్, కెంగర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రామమూర్తి, జనక్ ప్రసాద్, నర్సింహ రెడ్డి, గుమ్మడి కుమారస్వామి, రియాజ్ అహ్మద్, యాదగిరి సత్తయ్య, వై.యాకయ్య, ఇ.నరేష్, టి.రమేష్, టి.రాజిరెడ్డితోపాటు నాయకులు పాల్గొన్నారు. భారీ సంఖ్యతో ప్రత్యేకంగా హెచ్‌ఎంఎస్ బైక్ ర్యాలీ నిర్వహించింది. అదేవిధంగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సమ్మెతో గోదావరిఖని బస్టాండ్ నిర్మానుష్యంగా కనిపించింది. బస్సులు నడువక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమ్మె సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బొగ్గు గనులు, ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్‌లపై పోలీసు బలగాలు పెద్ద ఎత్తున పహారా కాశాయి. గని పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పోలీసుల బలగాలు గస్తీ తిరిగాయి.
ఎన్టీపిసిలో ఉద్యోగుల నిరసన
సార్వత్రిక సమ్మెలో ఎన్టీపిసి ఉద్యోగులంతా పాల్గొంటారని అనుకున్నప్పటికీ అనూహ్యంగా గురువారం రోజున ఎన్టీపిసి కార్మిక సంఘం సమ్మె నోటీసును విత్ డ్రా చేసుకోగా శుక్రవారం రోజున సమ్మె సందర్భంగా ఐ ఎన్‌టియుసి కార్మిక సంఘం నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపింది. ఎన్టీపిసి ఉద్యోగులు విధులకు యథావిధిగా హాజరయ్యారు. ఎన్టీపిసి కాంట్రాక్టు కార్మికులు మాత్రం సమ్మెలో పాల్గొని విధులను బహిష్కరించారు. మేడిపల్లి సెంటర్‌లో పెద్ద ఎత్తున వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు నిరసనను ప్రదర్శించారు.