కరీంనగర్

‘చింతకుంట’వి చిల్లర రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 3: ఉనికి కోసం నీటి పేరుతో టిడిపి జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయరమణా రావుకు ప్రాజెక్టుల మీద ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఎస్సారెస్పీలో నీరు రాకపోవడానికి టిడిపియే కారణమని ఆరోపించారు. ప్రాజెక్టులపై అవగాహన లేకుండా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని, అటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 1996లో ఎస్సారెస్పీ కాలువ ద్వారా పెద్దపల్లి చుట్టు చెరువులన్ని నింపానని, అప్పుడు నీవు ఎక్కడ ఉన్నావని విజయరమణారావును ప్రశ్నించారు. ఎస్సారెస్పీ కాలువ 384కిలోమీటర్ల పొడవు ఉందని, విజయరమణారావులు లాంటి వాళ్లు ఎక్కడికక్కడే నీళ్లకు గండికొట్టడం, ఆపడం చేస్తే కరీంనగర్ నీరు వస్తుందా అని ప్రశ్నించారు. నీటి వాడకాలు ఒక పద్ధతి ప్రకారం ఉంటాయని తెలిపారు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ము, ధైర్యముంటే బహిరంగ చర్చకు రావాలని విజయరమణరావుకు సవాల్ విసిరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పైపులు పగులగొడితే, ఆఫీసులను ధ్వంసం చేస్తే నీరు వస్తుందా అని ఎద్దేవా చేశారు. నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశావో, తానేమి చేస్తున్నానో ప్రజలకు తెలుసని, నీ చిల్లర రాజకీయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాజకీయ లబ్ది కోసం చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో నగర మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటి మేయర్ రమేష్, నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, చల్లా హరిశంకర్, అక్బర్‌హుస్సేన్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.