కరీంనగర్

రాష్ట్రంలో తుగ్లక్ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, సెప్టెంబర్ 8: పరిపాలన సౌలభ్యం పేరుతో జిల్లాలను విడగొట్టి తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటు రాష్ట్రంలో కెసిఅర్ తుగులక్ పాలన సాగిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఉపాద్యక్షుడు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి మండ్డిపడ్డారు. గురువారం అయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో పరిరక్షణ సమితి అధ్వర్యంలో హుస్నాబాద్,కోహెడ మండలాలను కరీంనగర్‌లో కొనసాగించాలని కోరుతు చేపట్టిన రిలే దీక్ష టిడిపి పార్టీదీక్షలో కూర్చోగా గురువారం నాటికి 13 రోజు చేరింది. ఈ సందర్భంగా అయన శిభిరాన్ని సందర్శంచి సంఘీభావం తెలిపారు.అనంతరం అయన మాట్లాడుతూ టిఅర్ ఎస్ పార్టీ అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు దాటిన అభివృద్దిమాత్రం ఎక్కడ కనిపించడం లేదని అరోపించారు.తన కుటుంబ పాలన కోసం ప్రజాభిప్రాయం గౌరవించకుండ జిల్లాలను నియోజకవర్గాలను ముక్కలు ముక్కలుగా చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.20 సంవత్సరాలు ఎంపి వినోద్‌కుమార్,ముఖ్య మంత్రి కెసిఅర్ టిడిపిలో ఉండి పదవులు పొందినప్పుడు అభివృద్ది కనబడ లేదాఅని ప్రశిన్నించారు.ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ, గ్రామాన సిసి రోడ్లు,వాటర్ పాంట్లు ,నిర్మించిందని తెలిపారు.హుస్నాబాద్,కోహెడ మండలాలను కరీంనగర్‌లో కొనసాగించకుంటే ఈ ప్రాంత కోసం న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్చి పేర్యాల రవిందర్‌రావు.అఖిల పక్షనాయకులు కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, అకుల వెంకట్, కోహెడ సృజన్‌కుమార్, జాగిరు సత్యనారయణ, యం శ్రీ్ధర్, బత్తుల శ్రీనివాస్, బొజు రవిందర్, ముప్పిడి రాజిరెడ్డి, వి. శ్రీనివాస్, దేవెందర్‌రెడ్డి పాల్గొన్నారు.