కరీంనగర్

‘కాళోజీ’ మహోన్నత వ్యక్తి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 9: అన్యాయాలపై తిరుగుబాటు, ధిక్కార స్వభావం, ప్రజాకవి, తెలంగాణ భాషాకోవిదుడు కాళోజీ నారాయణ రావు మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ నీతూప్రసాద్ కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో కాళోజీ 103వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళోజీ తెలంగాణ మాంత్రికుడుగా పేరుగాంచారని పేర్కొన్నారు. అదనపు జెసి నాగేంద్ర మాట్లాడుతూ కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ యాస, భాష నా శ్వాస అని ధిక్కార స్వభావం కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును సైతం స్వీకరించలేదని, బాల్య దశ నుండే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. సమాజంలోని తారతమ్య బేధాలను సహించేవారు కారని, అనేక పుస్తకాలు కూడా రచించారని, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి కాళోజీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాడిశెట్టి గోపాల్, దాస్యం సేనాధిపతి, గాజుల రవీందర్ మాట్లాడుతూ కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధికారులు, కళాకారులు, రచయితలు పాల్గొన్నారు.