కరీంనగర్

కెటిఆర్‌పై చిత్రపటానికి పిండ ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, సెప్టెంబర్ 11: మంత్రి కె.తారకరామారావు చిత్ర పటంలో పిండ ప్రదానం చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై టిఆర్‌ఎస్ నాయకులు స్పందిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా సాధన ఉద్యమం పక్కదారి పడుతూ ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీస్తున్నది. సిరిసిల్ల జిల్లా సాధన కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా కొందరు నాయకులు ఆదివారం సిరిసిల్ల మానేరు నదిలో మంత్రి కెటిఆర్ చిత్ర పటంతో పిండ ప్రధానం చేసి నిరసన తెలిపారు. ఈ సంఘటన వాట్సప్‌లలో హల్ చల్ చేయడంతో దీనిపై టిఆర్‌ఎస్ మండల నాయకులు సిరిసిల్లలోని మండల పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యమకారుల చర్యలను నిరసిస్తూ దీనికి ప్రతిగా కెటిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కెటిఆర్ చిచ్ర పటానికి పిండ ప్రదానం చేసిన యూత్ నాయకులు జలగం ప్రవీణ్, కందుకూరి రామాగౌడ్, రాజు, రాము తదితరులపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కెటిఆర్ చిత్ర పటంతో పిండ ప్రదానం చేయడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, వీరు ఘర్షన వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్టు సిఐ విజయకుమార్ వెల్లడించారు. కాగా ఆదివారం సాయంత్రం కెటిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పొలీసులను ఆశ్రయించిన వారిలో మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు అంకారపు శ్రీనివాస్, మాజీ ఎంపిపిలు పూసపల్లి సరస్వతి, గజభీంకార్ రాజన్న, నాయకులు కోడం సంథ్యారాణి, అగ్గిరాములు, విజయేందర్‌రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్ ఉన్నారు.