కరీంనగర్

ప్రశాంతంగా ఎంసెట్-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 11: విద్యా, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ఎంసెట్-3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 3,361 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా వీరికోసం నగరం, పరిసర ప్రాంతాల్లో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. పరీక్షా సమయానికంటే గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌ను, గుర్తింపుకార్డు తదితర సర్ట్ఫికెట్లను పరిశీలించి లోనికి అనుమతించారు. చేతి గడియారాలు, సెల్‌ఫోన్‌లు, కాలిక్యులేటర్లు, ఫేజర్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను లోనికి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు బందోబస్తు తో పాటు 144 సెక్షన్ నిషేదాజ్ఞలు అమలు చేశారు.