కరీంనగర్

పర్యాటక కేంద్రంగా బిజిగిరి షరీఫ్ దర్గా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట రూరల్, సెప్టెంబర్ 13: బిజిగిరి షరీఫ్ దర్గాను పర్యాటక కేంద్రంగా భక్తుల సౌకర్యం కోసం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని బిజిగిరిషరీఫ్ దర్గాలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రారంభించిన ఉర్సు ఉత్సవాలలో భాగంగా దర్గాను సందర్శించారు. దర్గాలోని అంకూశావలి సమాధులపై దేవతామూర్తుల సమాధులపై చాదర్లు కప్పి మొక్కులు చెల్లించుకున్నారు. ముస్లీం మత పెద్దలు అంకూశావలికి ప్రత్యేక ప్రార్థనలు జరిపి మంత్రికి ఆశీస్సులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి రాజేందర్ మాట్లాడుతూ గుట్టలలో నెలకొన్న దర్గాకు అధిక నిధులు వెచ్చించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి కృషి చేస్తానని, దర్గా సౌకర్యాల కోసం సమస్యలను వాటి పరిష్కారాలను కాగితం రూపంలో అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పింగిళి రమేష్, నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి, దర్గా కమిటి అధ్యక్షులు చోటేమియా, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అంకూశావలి, నాయకులు పొనగంటి మల్లయ్య, ఎక్కటి సంజీవ రెడ్డితో పాటు భక్తులు, గ్రామస్థులు, ప్రజలు పాల్గొన్నారు.