కరీంనగర్

గొర్రెల కాపరులకు ప్రభుత్వ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, సెప్టెంబర్ 24: రా ష్ట్రంలో కులవృత్తులకు ప్రభుత్వం చే యూతనిస్తుందని, నిరుద్యోగులు ఖాళీ గా సమయం వృధా చేయకుండా కులవృత్తులు చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖమంత్రి ఈటల రాజేంద ర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని వెంకటసాయి గార్డెన్‌లో శనివా రం మేకల, గొర్రెల పెంపకందార్ల సహాకార సంస్థ ఆధ్వర్యంలో రుణాల పం పిణీ కార్యక్రమం జరిగింది. 200 యూనిట్లకు రూ. 2 కోట్ల రూపాయల చెక్కులను మంత్రి ఈటలతోపాటు క రీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ మేకల, గొర్ల పెంపకం మంచి ఆదాయ మార్గం ఉన్న కులవృత్తి అని అన్నారు. ఇందులోనూ అధునాతన పద్దతులు తెలుసుకుని అవలంభించాలన్నారు. దీంతోపాటు మత్స్య, పశువు ల పెంపకం తదితర వృత్తుల్లో రు ణాలు, సబ్సిడీతోపాటు ఇన్సూరెన్సును కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం ని ర్ణయించిందన్నారు. తక్కువరేటు వడ్డీ రుణాలు, ఎక్కువ సబ్సిడీ ఇచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. నిరుద్యోగులు కూడా గొర్రెల, మేకల పెం పకం చేపట్టాలన్నారు. కరీంనగర్ ఎం పి బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు 20 వేల మేకలు, గొ ర్రెలు మహారాష్టత్రోపాటు ఇతర రా ష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటునా నమని వెల్లడించారు. ఇక్కడే పెద్దఎ త్తున ఒక పరిశ్రమలా పెంపకం చేపట్టేందుకు సహకార సంఘాలు కృషి చే యాలని కోరారు. రాష్ట్రంలో 1.20 కోట్ల గొర్రెలు, 50 లక్షల మేకలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయన్నారు. వీరికి ప్రభుత్వం ఎలాంటి సహాయం, సహకారం ఇచ్చేందుకైనా సిద్దంగా ఉందన్నారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి ఈటెలకు పెం పకందారులు డప్పు చప్పుళ్లు నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. మంత్రి రా జేందర్‌ను గొర్రెల పెంపకందారులు మేకపిల్ల ఇచ్చి, గొంగళితో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ, ఎంపిపి వొడితెల సరోజినిదేవితోపాటు నాలుగు మండలాల ఎంపిపిలు, జెడ్పీటీసీలు, నగర పంచాయతీ ఛైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ ఛైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.

చేనేత వృత్తిని...
కార్మికులను ఆదుకుంటాం
* ఆర్థికమంత్రి రాజేందర్

కరీంనగర్, సెప్టెంబర్ 24: చేనేత వృత్తిని, కార్మికులను ఆదుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక రెవెన్యూ గార్డెన్స్‌లో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలను మంత్రి ప్రారంభించారు. వ్యవసాయం తరువాత నేత కార్మికుల వృత్తి హుందాతనంగా ఉండేదని, కంపెనీ ఉత్పత్తులు ప్రారంభమైన తరువాత చేనేత కార్మికులు నిరాదరణ కు గురయ్యారన్నారు. గతంలో నెలకు మహిళలకు రూ. 2,500, పురుషులు రూ. 3 వేలు మాత్రమే సంపాదించేవారని, వారి బతుకులు బాగుపడలేదన్నా రు. తెలంగాణ ప్రభుత్వం గుర్తించి చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాయితీలు కల్పిస్తూ, నాణ్యమైన ఉత్పత్తులకు ప్రోత్సహిస్తున్నామని తెలిపా రు. బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ. 13.41 కోట్లు కేటాయించామన్నారు. కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి మార్కెటింగ్ సౌకర్యం ఈ స్టాళ్ల ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చేనేత పరిశ్రమపై ప్రధాని ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయతోనే...
గట్టిగా చెరువుకట్టలు
* భారీ నీటిపారుదలశాఖమంత్రి హరీష్‌రావు
గంగాధర, సెప్టెంబర్ 24: మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్దరణతోనే ప్రస్తుతం భారీవర్షాలు కురుస్తున్నా చెరువు కట్టలు బలం గా ఉండి నీరు పెద్దమొత్తం లో నిలువ ఉంటుందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సాయం త్రం గంగాధర చౌరస్తాలోని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ నివాసంలో ఆయన విలేఖరులతో మాట్లాడు తూ 2009-10లో అప్పటి వర్షాలకు 1107 చెరువులు తెగిపోగా, 2010-11లో 4 వేల చెరువులు తెగిపోయాయని, ప్రస్తుతం భారీవర్షాలు కురుస్తున్నా తెలంగాణ లో 170 చెరువులు మాత్రమే తెగిపోయాయని చెప్పారు. 30 వేల చెరువులను పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేశామని, చెరువులలో మట్టిని తీయడం ద్వారా భూగర్భజలాలు పెరగడంతోపాటు, రెండు పంటలకు నీరందే అవకాశాలున్నాయన్నారు. ప్రస్తుతం నీటి ఎమర్జన్సీని ప్రకటించామని, ప్రతి అధికారి తమకు కేటాయించిన ప్రాంతాల్లో అత్యవసర పనులు యుద్దప్రాతిపదికన చేస్తున్నారని, ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నా రు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయని, రెండు పంటలకు సాగునీరందించి రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. మెట్ట ప్రాంతమైన చొప్పదం డి నియోజకవర్గంలోని రైతాంగానికి 30వేల ఎకరాలకు పంటలు సాగుచేసుకొనేందుకుగానూ ఎల్లంపల్లి ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు. కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి పైపులైను ఏర్‌వాల్స్ ఏర్పాటు చేయడంలో అవాంతరాలు జరుగుతున్నాయని వర్షాలు తగ్గగానే మేడారం నుండి గంగాధర ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేస్తామన్నారు. కాకతీయ కాలువకు గండి పడిన పనులను త్వరితగతిన పూర్తిచే సి నీటిని తరలిస్తామన్నారు. అలాగే పంటలు, ఇండ్లు నష్టపోయినవారికి అంచనాల మేరకు నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే బొ డిగ శోభ, మార్కెట్ కమిటి చైర్మన్ రేండ్ల పద్మ, కొడిమ్యాల, గంగాధర మండల పార్టీ అద్యక్షులు చింతపాటి ఆగన్న, రేండ్ల రాజిరెడ్డి, మాజీ జడ్పీటిసి కనుకయ్య, మార్కెట్ కమిటి వైస్‌చైర్మన్ నజీర్, స్థానిక సర్పంచ్ బూమాగౌడ్‌తోపాటు పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వాన..వరద...!

* జిల్లాలో విస్తారంగా వర్షాలు * పొంగుతున్న వాగులు, వంకలు
* అలుగు దూకుతున్న చెరువులు * వందలాది ఎకరాల పంట నీటిపాలు
* పలు మండలాల్లో కూలిన ఇళ్లు * ఎల్‌ఎండికి భారీగా వస్తున్న వరద నీరు
* గంభీర్‌పూర్‌లో వృద్థురాలి మృతి * ముత్తారంలో గొర్లకాపరి అదృశ్యం
* ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్

కరీంనగర్, సెప్టెంబర్ 24: రెండేళ్లు గా కరువుతో అల్లాడిన జిల్లాలో గత మూ డ్రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతోపాటు పలు చెరువులు, కుం టలు జలకళను సంతరించుకోగా, ప లు చెరువులు అలుగు దూకుతున్నా యి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శనివారం జిల్లాలో ఓమోస్తారు నుంచి భారీ వర్షా లు కురిసాయి. జిల్లాలో 57 మండలాలుండగా, అత్యధికంగా ఇబ్రహీంపట్న ంలో 11, హుస్నాబాద్‌లో 10, సిరిసిల్ల లో 8, ముస్తాబాద్, కోహెడ, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంటల్లో 7, మెట్‌పల్లి, మ ల్లాపూర్‌లో 6, మేడిపల్లి, పెద్దపల్లిలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం న మోదైంది. మిగతా మండలాల్లో ఓ మోస్తారునుంచి భారీవర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 1964.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, సగటున 34. 1 మిల్లీమీటర్లు నమోదైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా ఉండటంతో నాలుగు గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలారు. భారీగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో 821 చెరువులు మత్తడులు దూకుతుండగా, 1133 చె రువులు జలకళను సంతరించుకున్నా యి. అటు ఎగువ మానేరు (నర్మాల) ప్రాజెక్టు అలుగు దూకుతోంది. లో యర్ మానేర్ డ్యాం (ఎల్‌ఎండి)కు భా రీగా వరదనీరు వచ్చి చేరుతోంది. భా రీగా నీరువచ్చి చేరుతుండటంతో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డా యంకు హారతి ఇచ్చారు. మిడ్‌మానేర్‌కు ప్రమాదం పొంచిఉండటంతో ఎస్సారె స్పీ వరద కాలువకు నీటిని నిలిపివేశారు. మిడ్‌మానేరు స్పిల్‌వే నుంచి నీరు పారుతోంది. మో యతుమ్మెద, మానేరు, మూల వా గులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బస్వాపూర్‌వద్ద మోయతుమ్మెదవాగు ఉదృతి తగ్గకపోవడం తో వరంగల్-సిద్దిపేటమధ్య రాకపోక లు యదావిధిగా నిలిచిపోయాయి. సి రిసిల్లలో మినిట్యాంక్ బండ్‌కు బుంగ ఏర్పడి నీరు వృధాగా పోతోంది. మహదేవ్‌పూర్ మండలంలోని పెద్దంపేట, అన్నారం వాగులు పొంగి పోర్లుతుండటంతో పంకెన, పలిమెల, సర్వాయిపే ట, పెద్దంపేట, నీలంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌లో నర్స వ్వ అనే వృద్థురాలు డ్రైనేజీ కాలువలో పడి మృతిచెందింది. ముత్తారం మం డల కేంద్రానికి చెందిన ఎల్లయ్య అనే గొర్ల కాపరి శుక్రవారం ఇంటినుంచి వె ళ్లి శనివారం సాయంత్రం వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. మల్లాపూర్ మండలం వాలుగొండలో మూడు ఇళ్లు కూలిపో గా, భీమదేవరపల్లి మండలం ముస్త్ఫాపూర్ గ్రామంలో పది ఇళ్లు కూలిపోయాయి. మరికొన్నిచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి. ఎక్కడా కూడా ప్రాణనష్టం జరగలేదు. మూడ్రోజులుగా కు రుస్తున్న వర్షాలతో వందలాది ఎకరాల పంట నీటిపాలైంది. దీంతో వర్షం కు రుస్తున్నాయని సంబరపడాలో.. పంట నష్టపోయిందని బాధపడాలో అర్థంకా ని పరిస్థితిలో అన్నదాతలు ఆందోళన కు గురవుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటం, ఎస్సారెస్పీ గేట్లను ఏ క్షణాన్నైనా ఎత్తివేసే అవకాశం ఉన్న నే పథ్యంలో జిల్లాలో ఎస్సారెస్పీ, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తం గా ఉండాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి హరీష్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు.

వర్షంపై హర్షం

* రైతుల్లో రబీపై చిగురిస్తున్న ఆశలు * హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో నామమాత్రం
* కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లిల్లో ఓ మోస్తరు వర్షాలు

హుజూరాబాద్, సెప్టెంబర్ 24: హు జూరాబాద్ సబ్‌డివిజన్‌లో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు రైతాంగాని కి కొంత ఊరటనిచ్చాయి. ఏడాదిన్నర కాలంగా రైతాంగం తీవ్ర కరవుకోరల్లో చిక్కుకుంది. గ్రామాల్లో కరవు విలయతాండవం చేసింది. కనీసం తాగునీరు కూడా దొరకని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది వర్షాకాలం దాదాపు ముగింపు కు వచ్చినా ఇప్పటివరకు ఒకటి రెండు చిన్న వానలు మినహా చెప్పుకోదగిన ఓమోస్తరు వానలు పడలేదు. కానీ బం గాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రైతుల పాలిట వరమైంది. గురు, శుక్ర వారాల్లో రెండు రోజులపాటు కురిసిన వర్షానికి పలు చెరువులు నిండగా మరి కొన్నింటికి వరద ప్రవాహం చేరుతోం ది. హుజూరాబాద్ చిలకవాగు, కోతుల నడుమ వాగుల్లో వర్షపునీరు ప్రవహిస్తో ంది. హుజూరాబాద్ మోడల్ చెరువు, సింగాపురం, చెల్పూర్ చెరువుల్లోకి నా మమాత్రంగా నీరు వచ్చి చేరుతోంది. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో వర్షం ఎక్కువగా కురవగా, హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో తక్కువ గా కురిసింది. ఎల్కతుర్తి మండలం జీ లుగుల, గోపాల్‌పూర్, కోతులనడుమ, వల్భాపూర్ చెరువుల్లోకి 70 శాతం నీ రు చేరింది. హుజూరాబాద్ మండలంలోని చిన్నపాపయ్యపల్లి, కందుగుల, బోర్నపల్లి, చెల్పూర్, సింగాపురం చెరువులకు కూడా నీరు చేరుతోంది. కమలాపూర్ పెద్ద చెరువు, ఉప్పల్ చెరువుల్లోకి పెద్దఎత్తున నీరు చేరింది. సైదాపూ ర్ మండలంలోని ఎలబోతారం, రాములపల్లి చెరువులు నిండాయి. వర్షం కారణంగా పత్తి పంటకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. అలాగే వరి పొలాలుకూడా పలుచోట్ల నీట మునిగాయి. రైతులు త మకు నష్ట పరిహారం అందించాలని కో రుతున్నారు. సెప్టెంబరు 15 వరకు కూ డా సమృద్దిగా వర్షాలు లేక రైతాంగం వ్యవసాయంపై ఆశలు పూర్తిగా వదులుకుంది. గత రెండు రోజుల నుండి కురిసిన వర్షాలతో రైతాంగంలో మళ్లీ ఆశలు చి గురిస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ బావుల్లో కూడా నీటిమట్టం పెరుగుతోంది.

మిషన్ కాకతీయలో
చెరువు మత్తడి ఎత్తు పెంపు

* 120 ఎకరాల పంట మునక
* చొప్పదండి, ధర్మారం మండలాల రైతులకు నష్టం
* నష్టపరిహారం చెల్లించాలంటూ రైతుల ఆందోళన
* కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామాల రైతులు

చొప్పదండి/్ధర్మారం, సెప్టెంబర్ 24: ప్రభుత్వం మిషన్ కాకతీయలో చెరవు ల పూడికతీత, మరమ్మతులు చేపట్టా రు. కానీ జూలపల్లి మండలం పెద్దాపూ ర్ పెద్దచెరువుకు మూడు మత్తడులు ఉ ండగా వాటి ఎత్తు పెంచడంతో ప్రస్తు తం కురుస్తున్న భారీవర్షాలకు చొప్పద ండి, ధర్మారం మండలాల పరిధిలోని ఆర్నకొండ, కళ్ళెంరెడ్డిపల్లి, గంటలపల్లి గ్రామాలకు చెందిన రైతుల వ్యవసా య పంటపొలాల్లోకి పెద్దాపూర్ చెరు వు బ్యాక్ వాటర్‌తో నీరు దాదాపు 120 ఎకరాల పంట మునిగింది. దీంతో ఈ ప్రాంతాల రైతులు లబోదిబోమంటున్నారు. పంట పొలాలు పొట్టకు వచ్చి చేతికందే సమయంలో ఇలా అనాలోచిత చర్యవల్ల పంట పొలాలు మునగటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. పెద్దాపూర్ చెరువు ఈ ప్రాంతంలో అతి పెద్ద చెరువు కావటంతో దీనికి ఇప్పటికే మూడు మత్తడులు ఉన్నాయి. వీటి మ త్తడి ఎత్తును 10 ఇంచుల వరకు పెంచినట్లు రైతులు పేర్కొంటున్నారు. పెం చిన ఎత్తుకు పూర్తిస్థాయిలో నీరు చేరుకుంటే వందలాది ఎకరాల పంటలు నీ టి పాలయ్యే అవకాశం ఉంది. దీంతో కళ్లెంరెడ్డిపల్లికి చెందిన రైతులు ధర్మా రం తహసిల్దార్ రాంమోహన్‌కు ఫి ర్యాదు చేయడంతో శనివారం తహసిల్దార్‌తోపాటు ఆర్‌ఐ రమేష్, విఆర్‌ఒ రాజయ్య, రాంచంద్రం, ఆర్నకొండ, క ళ్లెంరెడ్డిపల్లి, గంటలపల్లి గ్రామాలకు చె ందిన పలువురు రైతులు పెద్దఎత్తున తరలివచ్చి పెద్దాపూర్ చెరువు మత్తడిని పరిశీలించి, బ్యాక్‌వాటర్ పొలాల ము ంచివేతను పరిశీలించారు. ఈ పరిస్థితి లో వేసిన పంటలు చేతికివచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే పంట పొలాల ను ముంచి నీరు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇక వేసిన పంటలు నీటిపాలేనని రైతులు గొల్లుమంటునా నరు. మరోపక్క పంటపొలాలకు సం బంధించిన వ్యవసాయ బావులవద్ద ఉ న్న కరెంటు మోటార్లు సైతం పనికి రా కుండాపోయాయంటూ వాపోయారు. ఆర్నకొండ, గంటలపల్లికి చెందిన రైతులు తహసిల్దార్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారు.