కరీంనగర్

15 నాటికి పంట రుణాల లక్ష్యం పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 29: జిల్లాలో ఖరీఫ్ పంట రుణ లక్ష్యాలను అక్టోబర్ 15 నాటికి నూరు శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గు రువారం జిల్లాస్థాయి రివ్యూ కమిటి స మావేశం జరిగింది. మంత్రి మాట్లాడు తూ రైతులకు ఇచ్చే రుణాలు దేశ అభివృద్దికి దోహదం చేస్తాయని బ్యాంకర్లు గుర్తించాలన్నారు. వ్యవసాయానికి ఉ దారంగా రుణాలను అందిచాలని, జిడిసిలో 17శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ ఇతర రంగాలన్ని వ్యవసాయ ర ంగంపైనే ఆదారపడి ఉన్నాయని గుర్తించాలన్నారు. అవసరమైనచోట అదనపు సిబ్బందిని నియమించి రుణాలను ఇ వ్వాలన్నారు. ఖరీఫ్ పంట రుణాలు 53 శాతం మాత్రమే ఇచ్చారని నూరు శా తం రుణాలివ్వాలన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖచ్చితంగా అమలు చేయాలని, రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీ పై రుణాలివ్వాలని, గ్రామీణ ప్రాంతా ల్లో అన్నిరంగాలు వ్యవసాయరంగంపై ఆధారపడి ఉంటాయన్నారు. రబీ సీజన్‌లో నూరుశాతం రుణాలందించి రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 17 వేల కోట్ల పం ట రుణాలను మాఫీ చేశామని, ప్రతి సంవత్సరం 450 కోట్ల రూపాయలను పంట రుణ మాఫీ కింద బ్యాంకులకు అందిస్తున్నామని తెలిపారు. 50శాతం పంట రుణ రాయితీ ఇచ్చినందున బ్యాంకులు వంద శాతం రుణాలను రై తులకు ఇవ్వాలన్నారు. తెలంగాణలో పంటల సీజన్ జూన్ మొదటి వారంలో మొదలవుతున్నందున లాభం చేకూరుతుందని అన్నారు. వచ్చే సీజన్‌లో డిసెంబర్-జనవరి లోపునే రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరారు. బలహీన వర్గాల ప్రజలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడేందుకుగానూ ప్రభు త్వం రాయితీ రుణాలిస్తుందని తెలిపా రు. బ్యాంకులు ఈవిషయాన్ని గుర్తిం చి ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రాయితీ రుణాలను ఉదారంగా ఇవ్వాలని సూచించా రు. 2015-16లో 4628 రాయితీ రుణాలు లక్ష్యంకాగా, 4239 రుణాల ను ఇచ్చినట్లు తెలిపారు. 53.26 కోట్ల రుణాలను నిర్దేశించినట్లు తెలిపారు. ఇంతవరకు 462 మందికే రుణాలు ఇ చ్చామని, మిగిలిన రుణాలను త్వరలో ఇవ్వనున్నట్లు తెలిపారు. కలెక్టర్ సెక్యూరిటీ లేకుండా రాయి తీ రుణాలను ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమ యి బాలకిషన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, జీవన్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, ఎజెసి నాగేంద్ర, ఆర్‌బిఐ మేనేజర్ గణేష్, నాబార్డు మేనేజర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పించాలి
* బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు రూ. 15 కోట్లు * ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్

కరీంనగర్, సెప్టెంబర్ 29: చదువు అంటే మార్కులు కాకుండా పాఠశాల ల్లో విద్యార్థులకు చదువుతోపాటు తె లంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ను నేర్పించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మం త్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో ఏర్పాటుచేసిన బతుకమ్మ సం బరాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హా జరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించా రు. మంత్రి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ప్రజలందరు ఆనందోత్సవాలమధ్య జరుపుకోవాలని సూచిస్తూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పం డుగను అధికారికంగా నిర్వహిస్తుంద ని, బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు నిధు లు మంజూరు చేసిందని తెలిపారు. బ తుకమ్మ పండుగ సంబరాలద్వారా ప్ర జల్లో మానసికోల్లాసం కలుగుతుంద న్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ చిన్నారులలో బతుకమ్మ పండుగ విశిష్టత, తె లంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు అందించి ప్రోత్సహించాలని సూచించారు. పాఠశాలలో జరిగిన బతుకమ్మ సంబరాలు విద్యార్థినులకు చిన్ననాటి స్మృతులుగా నిలుస్తాయన్నారు. రాబో వుకాలంలో బతుకమ్మ ఉత్సవాలను మరింత ఘనంగా తెలంగాణ ప్రభు త్వం నిర్వహిస్తుందని చెప్పారు. వివిధ దేశాలలోఉన్న తెలంగాణ ప్రజలంద రు బతుకమ్మ పండుగను అక్కడ ఘ నంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రా ష్ట్రంలో వరుణుడి కరుణతో సమృద్ధిగా వర్షాలు కురిసాయన్నారు. పంటలకు నీటి కొదవ లేదని, జిల్లాలోని ప్రాజెక్టు లు, కుంటలు, చెరువులు నిండాయని, భూగర్భజలాలు పెరిగాయని తెలిపా రు. గ్రామీణ ప్రాంతాలు బాగుంటేనే రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు పాడిపంటలతో బంగారు తెలంగాణ నిర్మించాలని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎ మ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కా ర్పోరేటర్ చొప్పరి జయశ్రీ, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమురయ్య, ట్రాస్మా ప్రతినిధి శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మానేరుకు గండి ప్రభుత్వ వైఫల్యం..!
* కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి * నిర్వాసితులకు ఇచ్చిన మాట సిఎం నిలబెట్టుకోవాలి
* వైఎస్సార్ సిపి రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

బోయినిపల్లి, సెప్టెంబర్ 29: భారీ వర్షాలతో వచ్చిన వరదలతో మధ్యమానేరు కట్టకు గండిపడడం ఇది ప్రభుత్వ వైఫల్యం. దీనికి బాధ్యులైన కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలి. నిర్వాసితులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం రూ.5.04 లక్షల డబుల్ బెడ్ రూం పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ వైఎస్సార్ సిపి అ ధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మధ్యమానేరు వరద ప్రభావిత ప్రాంతమైన మానువాడ గ్రామాన్ని, కట్టకు గండి పడ్డ ప్రదేశాన్ని వైఎస్సార్ సిపి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి రెం డున్నరేళ్లు గడుస్తున్నా సరైన పర్యవేక్ష ణ లేక కాంట్రాక్టర్ ఇష్టారీతిన పనులు చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. కట్టకు గండిపడడం ప్రభుత్వ వైఫల్యంగా ఆయన అభివర్ణించారు. బాధ్యుడైన కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మిడ్‌మానే రు నిర్వాసితులకు ముఖ్యమంత్రి చం ద్రశేఖర్‌రావు ఇచ్చినమాట ప్రకారం డబుల్ బెడ్‌రూం పథకానికి రూ.5.04 లక్షలు ఇవ్వాలని, క్షమాపణతో తప్పించుకోవడం కుదరన్నారు. మానువాడ గ్రామాన్ని ముంపు గ్రామంగా తీసుకొని మిగతా గ్రామాల్లాగా పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. కట్టకు గండిపడి మానువాడ గ్రామంలోని 200 ఎకరాల పంటభూములు కొట్టుకుపోయాయని, మట్టి కొట్టుకుపోయి పంట పండించడానికి యోగ్యంకాకుండా రాళ్లురప్పలు మిగిలినందున పంట నష్టానికి ఎకరానికి రూ. 50 వేలు, భూమి పరిహారం ఎకరానికి రూ. 20 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలు నెలరోజుల్లో ప్రభు త్వం పరిష్కరించకపోతే వైఎస్సార్ సి పి ఆధ్వర్యంలో మిడ్‌మానేరు కట్టపై నిర్వాసితుల తరపున నిరాహారదీక్షలకు కూర్చుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు కొం డ రాఘవరెడ్డి, బోయినిపల్లి శ్రీనివాస్ రావు, డాక్టర్ కె.నగేష్, వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, నాయకులు సిరి రవి తదితరులు ఉ న్నారు.

పూల పండుగకు వేళాయెనే...
* నేటినుంచి బతుకమ్మ సంబరాలు షురూ
* తొమ్మిది రోజులపాటు బతుకమ్మ ఆటపాట
* పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు

కరీంనగర్, సెప్టెంబర్ 29: పూల పండుగకు వేళ అయింది. మరికొన్ని గంటల్లో రంగురంగుల, తీరోక్క పూలతో పేర్చిన బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు పా డే ఆటపాటల సంబురాలు శుక్రవారం నుంచి జిల్లాలో ప్రారంభంకానున్నాయి. ఎంగిళిపూలతో ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు కొనసాగనున్నాయి. చివరిరోజు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతిని, పల్లె జీవనశైలిని చాటిచెప్పెవిధంగా చిన్న,పెద్ద అనే తేడాలేకుండా మహిళలు ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాము అయే చందమామ... ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ..ఏమేమి కాయప్పునే గౌరమ్మ...అంటూ బతుకమ్మను కీర్తిస్తూ పాడే పాటలు నేటినుంచి మారుమ్రోగనున్నాయి. బతుక మ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కరీంనగర్ జి ల్లాకు రూ. 10 లక్షలు, జగిత్యాల జిల్లాకు రూ. 5 లక్షలు, పెద్దపల్లి జిల్లాకు రూ. 5 లక్షలు చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. అటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా జిల్లా అంతటా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏ ర్పాటు చేస్తోంది. అలాగే రాజకీయ పార్టీల మహిళా విభాగాల ద్వారా కూడా ప లుచోట్ల బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. నేటినుంచి బతుకమ్మ సం బరాలు ప్రారంభంకానుండగా, పలు పాఠశాలల్లో ముందస్తుగా గురువారమే బ తుకమ్మ సంబరాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మరికొన్నిచోట్ల బతుకమ్మ ఆటపాటలను నిర్వహించారు. మొ త్తానికి మహిళలోకం పూల పండుగలో పాల్గొంటూ సాయంత్రం నుంచి రాత్రి దాకా బతుకమ్మ ఆటపాటలతో మారుమ్రోగించనుంది.
నేటినుంచి విద్యాసంస్థలకు దసరా సెలవులు
బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని శుక్రవారం నుంచి విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలన్నింటికి సెలవులు వర్తించనున్నాయి. జిల్లాలోని ప్ర భుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు నేటినుంచి అక్టోబర్ 12వరకు సెలవులు ఉంటాయని జిల్లా విద్యాధికారి ఎస్.శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. సెలవుల్లో పాఠశాలలు నడిపించే ప్రైవేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఇఓ ఆ ప్రకటనలో హెచ్చరించారు. 11న దసరా, 12న మొ హరం పండుగలు వరుసగా వస్తున్నాయి. అక్టోబర్ 13న విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.

రూ. 50 లక్షల భూమిని కబ్జా నుండి కాపాడండి
* నగర పంచాయతీ సమావేశంలో సభ్యుల నిరసన
హుజూరాబాద్, సెప్టెంబర్ 29: హు జూరాబాద్ నగర పంచాయతీ పరిధిలోని గంగోనికుంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లో పంచాయతీకి ఇవ్వవలసిన సు మారు రూ. 50 లక్షల భూమిని విక్రయించేందుకు భూయజమానులు కబ్జా చేసేందుకు సిద్ధమవుతున్నారని, వారినుండి కాపాడాలని నగర పంచాయతీ కౌన్సిలర్లు కొయెడ కమలాకర్, ప్రతాప తిరుమల్‌రెడ్డిలు నిరసన వ్య క్తం చేశారు. గురువారం నగర పంచాయతీ పాలకవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి పంచాయతీ చైర్మన్ వ డ్లూరి విజయ్‌కుమార్ అధ్యక్షత వహి ంచగా సమావేశంలో పాల్గొన్న సభ్యు లు లేఅవుట్ భూమిపై నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీకి కేటాయించిన 30 గుంటల భూమిని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. కొంత మ ంది పాలకవర్గ సభ్యులు కాజేయాలని చూస్తున్నారని, వారినుండి ఆ భూమిని రక్షించాలని కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు.

నిధుల దుర్వినియోగంపై...
కమిషనర్‌ను నిలదీసిన సభ్యులు

* కమిటీలు లేకుండా అభివృద్ధి పనులు * టెండర్లు లేకుండా బ్లీచింగ్ కొనుగోళ్లు
* ప్రతినెల రూ. 3-4 లక్షలు దుర్వినియోగం
* అకౌంటెంట్ ద్వారా ఖర్చులు బైటకు తీస్తే అధికారులు ఇంటికి పోకతప్పదు
* అధికారులపై మండిపడ్డ కౌన్సిలర్లు

హుస్నాబాద్, సెప్టెంబర్ 29: హు స్నాబాద్ నగరపంచాయితీలో నిధుల దుర్వీనియోగంపై కౌన్సిల్‌ర్లలు కమీషనర్‌ను నిలదీశారు.గురువారం నగర పంచాయితీ కార్యాలయంలో చైర్మెన్ సుద్దాల చంద్రయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.నగర పంచాయితీలో బతుకమ్మ, శమిపూజ, దసరా ఉత్సవాల ఏర్పాట్లు కోసం వినియోగించే ఖర్చులపై అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా గత 6నెలలుగా పట్టణంలో నిధుల వినియోగంపై పెట్టిన ఖర్చులపై వివరాలను మేనేజర్ చదువుతుండగా పట్టణంలో నీటి సరఫరాకు మూడు ట్రాక్టర్లకు డీజిల్ కోసం లక్ష రూపాయలు, తెలంగాణ ఉత్సవాల కోసం పట్టణం లో అక్కన్నపేట చౌరస్తాలో, మల్లెచెట్టు, నగర పంచాయితీ ముందు వేసిన లై టింగ్ కోసం 75 వేలు, ఎల్‌ఆర్‌ఎస్ ప్రచారం కోసం (పట్టణంలో టాం- టాం,) చాటింపు చేయుటకు 90వేలు ఖర్చును చూపిస్తుండగా సభ్యులు అకుల వెంకట్, రమేశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తు అసలు పట్టణంలో అభివృద్దికంటే అవినీతే ఎక్కువ జరుగు తో ందని దీనిపై స్పస్టమైన అధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. నగ ర పంచాయితీలో ప్రతినెలకు 3లక్షల నుండి 4లక్షల వరకు అవినీతి జరుగుతోందని సభ్యులు అరోపించారు. తప్పుడు లెక్కపై అకౌంటెంట్‌ను నియమించి పూర్తి వివరాలను బహిర్గతం చేసి బాద్యులైన అధికారులను ఇంటికి పంపించాలని చైర్మెన్ కోరారు. 14వ వార్డులో వీధిదీపాలు లేక కాలనీ వాసు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని సభ్యురాలు చిత్తారి పద్మ అరోపించారు. పట్టణంలో దోమల నివారణ కోసం వాడల్లో ఉపయోగించే బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు కోసం ఎలాంటి టెండర్లు లేకుండా ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని గాదపాక రవీందర్ అరోపించారు. సభ్యులు మాట్లాడుతూ పట్టణంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమత్తుకోసం ఎ మ్మెల్యే ద్వారా నిధులను కోరాలని సూచించారు. ఇకనుండి పట్టణంలో జరుగు అభివృద్ది పనులపై కమిటి స భ్యులకు తెలుపాలని కోరారు. పట్టణంలో గృహనిర్మాణాలపై వస్తున్న పన్నులు లెక్కలు సరిగా లేవని సభ్యులు అరోపించారు. ఈ సందర్బంగా బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం రూ. 4.90 లక్షల ఖర్చుచేయుటకు సమావేశం అమోదం తెలిపారు. సమావేశంలో కమీషనర్ కుమారస్వామి, మెనేజరు, వైస్ చైర్మెన్ బి.సుధా కర్, కౌన్సిలర్లు పాల్గోన్నారు.