కరీంనగర్

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, సెప్టెంబర్ 30: ఎంగిళిపూలతో బతుకమ్మ సంబరాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామ గ్రామాన దేవాలయాల్లో, పలు వాడల్లో బతుకమ్మ.. బతుకమ్మ.. ఉ య్యాలో.. బంగారు బతుకమ్మ ఉ య్యాలో.. అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ బతుకమ్మ ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని అన్ని గ్రామాల్లోను బ తుకమ్మ పండుగను పురస్కరించుకొని తీరొక్కపూలతో బతుకమ్మలను పేరు స్తూ వేడుకలు జరుపుకున్నారు. అలాగే బతుకమ్మ ఉత్సవాలతోపాటు మరోపక్క శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఊరూరా పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే దుర్గామాతలను గ్రామాలలో పూజలకు సిద్ధం చే శారు. తొమ్మిది రోజులపాటు జరుగు బతుకమ్మ వేడుకల్లో భాగంగా శుక్రవారం మండలంలోని పాఠశాలలతో పాటు గ్రామాల్లోనూ ఎంగిళిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.