కరీంనగర్

బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, సెప్టెంబర్ 30: తెలంగాణలోని అన్ని జిల్లాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ అన్ని జిల్లా కేంద్రాలలో అక్టోబర్ 8న బతుకమ్మ మహాప్రదర్శన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని అన్నారు. వెయ్యి మంది నుండి ఐదు వేల మంది మహిళలతో ఈ ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. 9వ తేదీన సద్దుల బతుకమ్మ కార్యక్రమం ఉంటుందని, ఈ ఉత్సవాలలో జిల్లాలో ప్రతీఒక్కరు పాల్గొనేవిధంగా నిర్వహించాలన్నారు. ప్రజలను పెద్దఎత్తున భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో వే డుకలు నిర్వహించాలని సూచించారు. బతుకమ్మ వేడుకల నిర్వహణకు కరీంనగర్ జిల్లాకు రూ.10 లక్షలు, కొత్త జిల్లాలైన పెద్దపల్లి, జగిత్యాలకు రూ.5 లక్షల చొప్పున బడ్జెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. బతుకమ్మ నిమజ్జనం చేసే కుంటలు, చెరువుల వద్ద కనీస వసతులు కల్పించాలని అన్నారు. తాగునీరు, పారిశుద్ధ్య చర్యలతో పాటు పటిష్టమైన భద్రత కల్పించాలని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలుగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. బతుకమ్మ ఉత్సవాలను గొప్పగా నిర్వహించిన జిల్లాలను గు ర్తించి బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. మొదటి బహుమ తి రూ.5 లక్షలు, రెండవ బహుమతి రూ. 3 లక్షలు, మూడవ బహుమతి రూ. 2 లక్షలు ఇస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ సారథి కళాకారులను బతుకమ్మ ప్రాశస్త్యాన్ని తెలియజేసేవిధంగా గ్రామాలలో ప్రదర్శనలు ఇస్తారని తెలిపారు. సద్దుల బతుకమ్మ నాడు జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 8వ తేదీన ఐదు వేల మంది మహిళలతో మహాబతుకమ్మ ప్రదర్శనను నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల భాగస్వా మ్యం ఎక్కువగా ఉండేవిధంగా పండుగను నిర్వహిస్తామని అన్నారు. సద్దుల బతుకమ్మకు అన్ని చెరువులు, కుంటల వద్ద వౌళిక సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాలలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఎజెసి నాగేంద్ర, డిఆర్‌ఓ వీరబ్రహ్మయ్య, డిఆర్‌డిఎ పిడి అరుణశ్రీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.