కరీంనగర్

మీరేమంటారు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 2: కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ప్రారంభమయ్యే సమయం రానేవచ్చింది. మరో తొమ్మిది రోజుల్లో దసరా రాబోతోంది. ఆ రోజు నుంచే కొత్త పాలనను ఆరంభించాలని సిఎం కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది అంకానికి చేరుకున్న దరిమిలా పార్టీ ప్రజాప్రతినిధులతో ఒకసారి జిల్లాల పునర్వీభజనపై చర్చించాలని కెసిఆర్ భావించి జిల్లా ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పంపారు. సోమవారం జిల్లా ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటీ కానున్నారు. ఇప్పటికే జిల్లాల పునర్వీభజనపై హైదరాబాద్‌లో అన్ని పార్టీల నేతలతో సిఎం కెసిఆర్ సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అలాగే ముసాయిదా ప్రకటనపై సుమారు నెలరోజుల పాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. జిల్లాలో కుప్పలు తెప్పలుగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అందాయి. సుమారు 30వేల వరకు అందగా, రాష్ట్రంలోనే జిల్లా రెండవ స్థానంలో ఉంది. దీనికితోడు సిరిసిల్ల జిల్లా కోసం ఆ ప్రాంతమంతా రగిలిపోతుండగా, ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం కోరుట్ల వాసులు, కరీంనగర్ జిల్లాలోనే హుస్నాబాద్, కోహెడలను కొనసాగించాలంటూ ఆ మండలాల ప్రజలు, కాటారాన్ని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలంటూ ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు. ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై ఉద్యమకారులు ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ తుది అంకానికి చేరుకున్న దరిమిలా పునర్ వ్యవస్థీకరణపై ఒకసారి పార్టీ నేతలతో చర్చించి, నేతల్లో నెలకొని ఉన్న భిన్నభిప్రాయాలకు తెరదించి, జిల్లా ఆవిర్భావ సంబరాలు చేసుకునే దిశగా వారిని సమాయత్తం చేసేందుకు సిఎం కెసిఆర్ నడుంబిగించారు. ఈ క్రమంలోనే సోమవారం జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్లు, డిసిఎంఎస్, డిసిసిబి చైర్మన్లు, జిల్లా అధ్యక్షుడితో సిఎం కెసిఆర్ భేటీ అవుతున్నారు. ఈ మేరకు వీరందరికి ఆహ్వానలు అందగా, సోమవారం హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ భేటీలో జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు అవసరమైతే వాటిని పరిగణలోకి తీసుకుని కొంత చేర్పులు, మార్పులతో జిల్లా, డివిజన్, మండలాల కూర్పు కుదుర్చే అవకాశాలున్నాయి. అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా జిల్లాల ఏర్పాటు ఉండాలని సిఎం భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతుండగా, సిరిసిల్ల జిల్లా కోసం ఆందోళనలు తీవ్రతరం కావడం, ఇప్పటికే పలుమార్లు హైదరాబాద్ వరకు వెళ్లి పునర్వీభజన కమిటీ సభ్యులకు వినతిపత్రాలు అందజేసిన క్రమంలో సిరిసిల్ల జిల్లాపై సిఎం కెసిఆర్ మరోమారు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని, ఒకవేళ సిరిసిల్ల జిల్లా అయితే కావచ్చంటూ ఇక్కడ ప్రచారం జరుగుతోంది. మరీ నేటి సమావేశంలో సిఎం కెసిఆర్ జిల్లా నేతలతో ఏం చర్చిస్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.