కరీంనగర్

భూములు కోల్పోతే బతకడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవపూర్, అక్టోబర్ 7: కాళేశ్వ రం ప్రాజెక్ట్‌లో భాగంగా కనె్నపల్లి వద్ద నిర్మించతలపెట్టిన పంప్‌హౌస్ కొరకు భూములు కొల్పోతే తాము బతకడం ఎలా అని కనె్నపల్లి రైతులు ఎమ్మెల్యే పుట్ట మధుకు మొరపెట్టుకున్నారు. శుక్రవారం కనె్నపల్లిలో గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్ట మధు రైతులతో మాట్లాడుతూ ఇదివరకే 48 ఎకరా ల భూమి సేకరించి లావణి పట్టా వారి కి ఎకరానికి 3.02లక్షల రూపాయల నష్టపరిహారం అందించడం జరిగింద ని, మరో 300 ఎకరాల భూసేకరణ జ రగాల్సిఉందని, ఇందులో పట్టా భూ ముల రైతులున్నారని, స్థానికంగా రూ. 10 లక్షల వరకు భూముల ధరలున్నాయని రైతులు పేర్కొనగా ప్రభుత్వం నుంచి ఏమేరకు నష్టపరిహారం కావాలనో... అందరికి ఆమోదయోగ్యమైన నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రా ంతంలో నీళ్లు ఉన్నందునే లేని ప్రాం తాల రైతులకు మేలు చేసేవిధంగా ప్ర భుత్వం చేస్తుందని, ఈక్రమంలో మన ప్రాంత రైతులు కొంతమేర నష్టం ఉం టుందని, దానిని అధిగమించడానికే రైతులకు అన్నివిధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని కనె్నపల్లి రైతులకు ఎమ్మెల్యే పుట్ట మధు తెలిపా రు. ఇదివరకే జెన్‌కో కొరకు కనె్నపల్లి రైతులు భూములు ఇచ్చారని, పక్కనే ఉన్న బీరాసాగర్‌లో కూడా పంప్‌హౌ స్ కొరకు భూములు ఇచ్చారని, ఈ క నె్నపల్లివద్ద పంప్‌హౌస్ నిర్మాణం కొ రకు భూములు ఇస్తే మీ ఊరు చరిత్ర లో నిలుస్తుందన్నారు. గ్రామసభలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సిఇ వెంకటేశ్వర్లు, భూ సేకరణాధికారి, రిటైర్డ్ తహశీల్దార్ రవీందర్, ఎంపిపి వసంత, జడ్పిటిసి హసీనాభాను, ఎఎంసి చైర్మన్ లింగంపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ మ ల్లారెడ్డి, సంజీవరెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.