కరీంనగర్

నిరంతర నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, అక్టోబర్ 9: జిల్లాలో నిరంతర తాగునీటి సరఫరాకు ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులకు సూచించారు. ఆదివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో మున్సిపల్, ప్రజాప్రతినిధులు, కన్సల్టెన్సీలతో వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు నిరంతరంగా సరఫరా చేయడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు తాగునీటిని అందించేందుకు అవసరమైనన్ని నిధులను కేటాయిస్తుందని, కరీంనగర్ పట్టణాన్ని సుందరీకరణ చేయడమే తన ధ్యేయమని అన్నారు. పట్టణ ప్రజలకు నీరందించేందుకు కావాల్సిన ప్రతిపాదనలు, నిధులు, నిర్ణీత వ్యవధిలో నాణ్యమైన పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలను తయారు చేయాలని సూచించారు. అలాగే గతంలో ఉన్నటువంటి పైపులైన్ల స్థానంలో అవసరమైన మేర కొత్త పైపులైన్లు వేసేందుకు పరిశీలించాలని సూచించారు. కరీంనగర్ ఎంపి బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణ సుందరీకరణకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ఒక భాగమని తెలిపారు. అంతకుముందు శ్రీనివాసాచారి, శ్రీకాంత్ కన్సల్టెన్సీలు వారి వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన కమీషనర్ దాన కిషోర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, దాసరి మనోహర్ రెడ్డి, మేయర్ రవీందర్ సింగ్, కలెక్టర్ నీతూ ప్రసాద్, జెసి శ్రీ దేవసేన, మున్సిపల్ కమీషనర్ కృష్ణ్భాస్కర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.