కరీంనగర్

వందశాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, మార్చి 31: నియోజకవర్గంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వందశాతం లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో గురువారం ఆమె అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. మండలాల వారిగా గ్రామాల వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణంలో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని, నిర్మాణం ప్రారంభించకముందే రూ.6 వేలు అడ్వాన్సుగా ఇస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇసుక, ఇటుక, సిమెంట్, తలుపులు, రేకులు, రింగులు, బేసిన్లు వంటి సామాగ్రి కూడా వెంటనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమం అంతటిని ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తవద్దనే ఉద్దేశంతో కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని, వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత నియోజకవర్గంగా తీర్చి దిద్దాలన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర, ఆర్ డి వో చంద్రశేఖర్, అర్ డబ్లు ఎస్ ఎస్ ఈ సూర్యప్రకాష్‌రావు, వయోజన విద్య డిడి జయశంకర్, ఎంపిపిలు సరోజినిదేవి, మల్లమ్మ, ఎంపిడివోలు, తహశీల్దార్‌లు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.