కరీంనగర్

ప్రతినెల సందర్శిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక, అక్టోబర్ 21: జిల్లాల పునర్విభజన జరిగినందున కరీంనగర్ జి ల్లా పరిధి తగ్గిందని, అందువల్ల ప్రజల సౌలభ్యం కోసం ప్రతీనెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఆసుపత్రులను సందర్శిస్తానని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేశం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మోడల్ ప్రాథమి క ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విధులకు సకాలంలో సిబ్బంది హాజరు కావాల ని సూచించారు. ప్రతీరోజు వచ్చే రోగుల వివరాలను, ఛరవాణి నంబర్లను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రానికి రక్షణ కోసం ప్రహరీ లేనందున ఏమేరకు నిధులు అవసరమో నివేదికను ప్రభుత్వానికి పంపిస్తానన్నారు. ఆయన వెంట వైద్యులు నాగేంద్ర, సిబ్బంది ఉన్నారు.