కరీంనగర్

మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్‌పల్లి, అక్టోబర్ 23: మత్స్యకార్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో కృషి చేస్తున్నదని కోరుట్ల ఎమ్మె ల్యే విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం మెట్‌పల్లి పట్టణంలోని పెద్ద చెరువులో మత్స్యకార సహకార సంఘ సభ్యులతో కలిసి చెరువులో చేపపిల్లలను వదిలారు. ఈసందర్బంగా ఆయ న మాట్లాడుతూ కులవృత్తులు ఆదరణ కోల్పోతున్న తరుణంలో తమ ప్రభు త్వం కుల వృత్తులను ప్రోత్సాహించి వారి సంక్షేమానికి కృషి చేస్తూ వారు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుందన్నారు. 75వేల విలువ గల చేప పిల్లల ను మత్స్యకార సహకార సం ఘానికి ఇవ్వడం జరిగిందన్నారు. మిషన్ కాకతీయ తో చెరువులకు జలకళ వచ్చిందని వరణుడి దయ తో చెరువులన్ని నిండి సాగు, త్రాగు నీటికి ఇబ్బంది లేకుండా కలిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి ఉమారాణి, వైస్ చైర్మన్ మార్గం గంగాధర్, నాయకులు బర్ల సాయన్న, సహదేవ్, షాకీర్, నర్సగౌడ్, మత్స్యకార సంఘం నాయకులు దుబ్బ రాజయ్య, శంకర్‌లు పాల్గొన్నారు.