కరీంనగర్

‘దస్త్రాల పరిష్కార దినోత్సవం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 23: సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన ఫైళ్ళ పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ తనిఖీలు నిర్వహించారు. ఆదివారం సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు సెలవును రద్దు చేయడంతో పాటు వివిధ శాఖలను పరిశీలించారు. నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ ప్రాంతానికి సంబంధించిన 1236 ఫైళ్ళను ఇటీవల కరీంనగర్ కలెక్టరేట్ నుండి ఇక్కడికి బదిలీ చేశారు. అయితే ఆయా శాఖలలో ఈ ఫైళ్ళ పరిస్థితిని పరిశీలించి ఫైళ్ళ పరిష్కారం దినోత్సవం సందర్భంగా కలెక్టర్, ఆర్డీవోలు తనిఖీలు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళు గుర్తించి అందుకు కారణాలు, ఫైళ్ళ స్థితిగతులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాటిని సత్వరంగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.