కరీంనగర్

రోడ్డు ప్రమాద సంఘటనలన్నీ... ప్రభుత్వ హత్యలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, అక్టోబర్ 24: రోడ్డు సక్రమంగా లేకపోవడంతో ముల్కనూ ర్ శివారువద్ద ఇరువురు మృతికి కారణ ం ఆర్‌అండ్‌బి అధికారుల తప్పిదమేనని, దీనికి బాధ్యులుగా వారిని ససె పండ్ చేయాలని భారత కమ్యూనిష్టు పార్టీ మండల కార్యదర్శి ఆదరి శ్రీనివా స్ ఆధ్వర్యంలో వరంగల్-సిద్ధిపేట్ హైవేపై రెండు గంటలపాటు సోమవా రం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ విద్యాభారతి పాఠశాల ఆవరణవద్ద రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో ముల్కనూర్ గ్రామానికి పెళ్లిపత్రికలు పంచేందుకు వచ్చి ఆరునెలలక్రితం ఒకరు మృత్యువాత పడినట్లు సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. వీరి తోపాటు అదే ప్రాంతంలో మరొకరు గుంతల రోడ్డువద్ద మృత్యుఒడిలోకి చేరుకున్నట్లు వెల్లడించారు. పదిమంది కి పైగా అదే రోడ్డు పై పడడంతో తీవ్ర గాయాలై కాళ్లు, చేతులు విరిగిన స ంఘటనలు ఉన్నాయన్నారు. మండల ం మొత్తం రోడ్డు బాగుండడంతో ఈ రోడ్డు సైతం అలాగే ఉంటుందని భావిస్తున్న ప్రయాణీకులు స్పీడుగా వచ్చి గుంతలు రోడ్డుపై పడడంతో మృతి చె ందుతున్నారన్నారు. పలువురికి గా యాలు, ఇరువురి మృతికి బాధ్యులుగా ఆర్‌అండ్‌బి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన ంగా నిర్మిస్తున్న రోడ్డు పనులు సైతం నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఇరువురి మృతి కారణానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్ధానిక ఎ మ్మెల్యే వెంటనే వౌనం వీడి పనులు చేయించాలని ప్రజలకు జవాబుదారిగా నిలవాలని డిమాండ్ చేశారు. హైవేపై సిపిఐ నాయకులు రాస్తారోకో చేస్తున్న విషయం తెల్సుకున్న ఎస్‌ఐ సంతోష్‌కుమార్ వెంటనే సంఘటన స్ధలానికి వచ్చి సిపిఐ నేతల సమస్యలు తెల్సుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. దీంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో పాల్గొన్నవారిలో రేణుకుంట్ల రాజు, పిట్టల సాగర్, ఆదరి రమేశ్, కంచర్ల సదానందం, పిట్టల శ్రీనివాస్, పోగుల రమేశ్, మేకల బిక్షప తి, పులి కుమారస్వామి, కొత్త శ్రీనివాస్, మండల శివ, రమేశ్, లక్కిరెడ్డి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నరుూంతో శ్రీధర్‌బాబుకు సంబంధాలు
* ఎమ్మెల్యే పుట్ట మధు
మంథని, అక్టోబర్ 24: గ్యాంగ్‌స్టర్ నరుూంతో మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సంబంధాలు ఉన్నాయని ఎ మ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. సో మవారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. మాజీమంత్రి శ్రీధర్‌బాబుకు గ్యాంగ్‌స్టర్ నరుూంతో సం బందాలు ఉన్నట్లు ఈమధ్య వాట్స్‌ప్, ఫేస్‌బుక్‌ల్లో రికార్డులు చూడటం జరిగింది. గతంలో భూపాలపల్లి నుండి కాటారంకి వస్తున్న కాటారం స్థానికు డు పాస్టర్ తిమోత్ మార్గమధ్యలో మరణించడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాటారం మండలంలోని దన్‌వాడలో 5 హత్యలు జరిగాయని అవి హత్యలా... ఆత్మహత్య లా అని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదన్నారు. ఈ హత్యలపై పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ముత్తారం మండలానికి చెం దిన జడల నాగరాజు ఆచూకీ ఇప్పటి వరకు తెలియదు దీనివెనక మాజీ మ ంత్రికి సంబంధాలు ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. గతం లో నాపైన కూడా హత్యప్రయత్నం జరిగే ప్రమాదముందని చాలామంది మమ్మ ల్ని హెచ్చరించారన్నారు. చాలామంది తనకు నరుూంతో మాట్లాడిన ఫోన్ సంభాషణ తన దగ్గర ఉందని వీటితోపాటు మరిన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయనా నరు. అంతేకాకుండా శ్రీధర్‌బాబు తన అనుచరులకు గన్ లైసెన్స్‌లు ఇప్పించి అ నేక అక్రమాలకు పాల్పడి అనేకమందిని భయభ్రాంతులకు గురిచేశారన్నారు. వీటన్నిటీపైన సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రికి, డిజిపికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మంథనిలోని నరుూం అనుచరులతో శ్రీధర్‌బాబుకు ఎంత సా న్నిహిత్యం ఉండేదో మంథని ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికైనా సదరు వ్యక్తులు ఏయే సెటిల్‌మెంట్‌లో ఎప్పుడెప్పుడు ఉన్నారో వారికివారే తెలియపరచి ముం దుకు రావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎంపిపి ఏగోలపు క మల, నాయకులు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, సమ్మయ్యలు ఉన్నారు.

దాబాల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు
* బెల్ట్‌షాపులపై దాడులు చేయాలని ఆదేశం
* పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్

గోదావరిఖని, అక్టోబర్ 24: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మం చిర్యాల జిల్లాల జాతీయ, రాష్ట్రీయ రహదారులపైఉన్న దాబాలల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రా మగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్ జిత్ దుగ్గల్ హెచ్చరించారు. ఎక్కడా కూడా అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు జరిగినా... గుడుంబా విక్రయాలు జరిగిన, బెల్ట్‌షాపులు కొనసాగినా ఊరుకునే ప్రసక్తే లేదని ఖరాకండిగా తేల్చిచెప్పారు. సోమవారం పోలీ స్ కమీషనర్ దుగ్గల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఎక్కడా కూడా అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు జరపరాదని, ఆ పరిధిలోని గుడుంబా అమ్మకాలు, బెల్ట్ దుకాణాలపై ఉక్కు పాదం మోపాలని, ఎక్కడికక్కడ ఆకసి మక దాడులు చేపట్టాలని పోలీస్ కమిషనర్ దుగ్గల్ పోలీసు అధికారులను ఆ దేశించారు. బెల్ట్ దుకాణాలపై దాడులు చేపట్టి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాం తాల్లో గుడుంబా తయారీ, రవాణా చే సేవారిపై... బెల్ట్ దుకాణాల నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని దు గ్గల్ స్పష్టంగా పేర్కొన్నారు.

మందుబాబులకు పోలీసుల ఝలక్
* డంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు సిపి క్లాస్
* మత్తు దిగేలా కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్
* రెండోసారి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం
* పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, అక్టోబర్ 24: మ ద్యం మత్తు దిగేలా మందుబాబులకు కరీంనగర్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 23 మంది మం దుబాబులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రె డ్డి సోమవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం మొదటి త ప్పుగా భావించి వదిలేస్తున్నామని, మరోసారి తాగి వాహ నం నడిపి పట్టుబడితే జరిమానాతోపాటు జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యుల సమక్షంలో వార్నింగ్ ఇచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ రెండోసారి పట్టుబడ్డవారి డ్రైవింగ్ లైసెన్స్‌లను కూడా రద్దుచేస్తామని, తాగి ఎవ రూ వాహనాలు నడుపవద్దని కోరారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడాన్ని నిషేధిస్తున్నామని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, తాగి వాహనం నడిపినా కఠిన చర్యలు చేపడతామని కమలాసన్‌రెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని నియంత్రించేందుకు నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్‌లను నిర్వహిస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రోజూ సాయంత్రం 7 గంటల నుం డి అర్ధరాత్రి వరకు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు మహేష్‌గౌడ్, నారాయణతోపాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలోనే కరీంనగర్‌ను నం. 1 చేస్తాం

ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, అక్టోబర్ 24: అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాను నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందు కు కృషిచేస్తానని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం సా యంత్రం కలెక్టరేట్ సమావేశమందిరం లో జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల పై సమీక్షాసమావేశం నిర్వహించారు. జిల్లాల ఏర్పాటుతో అధికారులకు పరిపాలన, పర్యవేక్షణ సులభతరమైంద ని, అధికారులు కొత్త ఒరవడి, సాంప్రదాయాలకు పునాది వేయాలన్నారు. జి ల్లాలో జరిగే అభివృద్ధి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. అందరం కలిసి తెలంగాణ తెచ్చుకునా నమని, అలాగే అందరం కలిసి బం గారు తెలంగాణను నిర్మించుకోవాలని సూచించారు. అధికారులు ప్రజల ఆశయాలకనుగుణంగా, వారి అవసరాల కనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. అపరిష్కృత సమస్యలను వెం టనే పరిష్కరించాలని ఆదేశించారు. ఏ ఫిర్యాదుదారుడు సమస్య పరిష్కారాని కి రెండవసారి రాకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలోని మంత్రి, కలెక్టర్, అధికారులు జిల్లా పరిధిలోని ప్రతీ కుటుంబంపై దృష్టిపెట్టాలని సూ చించారు. అధికారులు నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి ప్రజల ప్రేమను పొందాలని సూ చించారు. ప్రభుత్వంపై ప్రజలకు వి శ్వాసం కల్పించాలని కోరారు. కరీంనగ ర్ నగరాన్ని పర్యాటక కేంద్రంగా మా ర్చేందుకు తనవంతు కృషిచేస్తానని, న గరంలో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తామని, కొత్త జిల్లాలో జిల్లా అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. అర్హులై నవారందరికీ పింఛన్లు మంజూరు చే యాలన్నారు. చనిపోయినవారిని పిం ఛన్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. అర్హతగలవారందరికీ రేషన్‌కార్డులను మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఫర్నీచర్ మంజూరు చేశామని, జనవరి లోగా ఫర్నీచర్ అందేలా పర్యవేక్షించాలని కలెక్టర్‌కు సూచించారు. ఇళ్లపైను ంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను వెంటనే తొలగించాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరుచేసినట్లు చెప్పారు. గ్రామాలలో బిటి రోడ్లపై కేజివీల్స్ ట్రాక్టర్లు నడవకుండా కఠిన చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని చెరువులలో, కుంటలలో చేపపిల్లలను వదలాలన్నారు. రబీలో విత్తనా లు, ఎరువులకు కొరత లేకుండా చూ డాలని ఆదేశించారు. జిల్లా విద్య, వైద్యశాఖలపై ఎమ్మెల్యేలు, జడ్పీటిసిలు, ఎం పిపిలతో కమిటీలు వేసి పర్యవేక్షిస్తామ ని, గ్రామాలలో విద్యుత్ లైన్లకింద ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని, అలా ఎవరైనా కడితే నిర్మాణాలను ఆపేయాలని, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత పరీక్షలు లే కుండా బిల్లులు చెల్లించవద్దని ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. జిల్లాలోని అన్ని వసతిగృహాల పిల్లలందరికీ బెడ్స్, గ్లా సులు, ప్లేట్స్ సరఫరా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద మ ంజూరైన రూ. 28 లక్షల చెక్కులను 37 మందికి మంత్రి పంపిణీ చేశారు. స మావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉ మ, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, సతీష్‌కుమార్, శోభ, కలెక్ట ర్ సర్ఫరాజ్ అహ్మద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నేడు తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా
ఎలిగేడు, అక్టోబర్ 24: ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌చేస్తూ మంగళవారం ఎలిగేడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు బిజెపి మండల అధ్యక్షుడు గర్రెపల్లి నారాయణస్వామి, చంద్రశేఖర యాదవ్, అడ్డగుంట తిరుపతిగౌడ్‌లు అన్నారు. ఈ ధర్నాకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. మండలంలోని బిజెపి శ్రే ణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో సామాన్లు దగ్ధం
* లక్ష రూపాయల నష్టం
సుల్తానాబాద్, అక్టోబర్ 24: మండల కేంద్రంలోని శివాలయం వీధిలో పూ జారి వల్లంకొండ మహేష్ ఇంటిలో సోమవారం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కావడంతో పెద్దఎత్తున మంటలు లేచి ఇంట్లోని విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. షాట్‌సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్, వంటసామాన్లు, విలువైన బట్టలు, ఇతర సామాన్లు పూర్తిగా కాలి దగ్ధమయ్యాయి. దీంతో దాదాపు లక్ష రూపాయ ల వరకు నష్టం వాటిల్లినట్లు పూజారి మహేష్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని విద్యుత్‌శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించారు. విద్యుత్ షాట్‌సర్క్యూట్‌తో నష్టపోయిన తమను ఆదుకోవాలని పూజారి మహేష్ వేడుకుంటున్నారు.
అప్పుల బాధతో యువ పత్తి రైతు ఆత్మహత్య
సైదాపూర్, అక్టోబర్ 24: మండలంలోని బొమ్మకల్‌కి చెందిన బండి రవీందర్(32) అనే యువ పత్తి రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపి న వివరాల ప్రకారం.. తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో రెండు ఎకరాలు కౌలు కు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నా డు. సంవత్సరంక్రితం తన వ్యవసాయబావి లో పూడిక పనులు తీస్తుండగా తాడు తెగి కార్మికుడు మృతిచెందడంతో నష్టపరిహారంకింద అతనికి లక్ష రూపాయలు చెల్లించాడని తెలిపారు. గత రెండేళ్ల నుండి వర్షాలు లేక పంట చేతికి రాకపోవడంతో దిగాలు చెందిన రైతు మానసిక క్షోభతో ఎవరూలేని సమయంలో తన పత్తిచేనులో ఈ నెల 18న పురుగులమందు తాగి అపస్మారకస్థితిలో ఉండగా గుర్తించిన చుట్టుపక్కల రైతులు చికిత్సనిమిత్తం హుజూరాబాద్‌కు తీసుకెళ్లగా డాక్టర్ల సూచన మేరకు వరంగల్ ఎంజిఎంకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడికి భార్య కోమలతోపాటు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతుని భార్య సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వంగర పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎంపిడిఓపై కలెక్టర్‌కు ఫిర్యాదు
సైదాపూర్, అక్టోబర్ 24: సైదాపూర్ ఎంపిడిఓ వినోదపై మండలంలోని సో మారం గ్రామానికి చెందిన వీరగోని రాజయ్య సోమవారం జిల్లా ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 12న ప్రజావాణిలో నకిలీ పెన్షన్లు, వికలాంగులు కాకున్నవారికి పెన్షన్లు తదితర అక్రమ పెన్షన్లపై ఫిర్యాదుచేసినా స్ప ందించలేదని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, సంబంధిత శాఖ డిఆర్‌డిఎకు పంపించినట్లు వీరగోని రాజయ్య తెలిపారు.
చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
సుల్తానాబాద్, అక్టోబర్ 24: సుల్తానాబాద్ మండలంలోని ఏడు గ్రామాల్లో రంజాన్ పండుగను పురస్కరించుకొని మజీదులు, ఈద్గాలు మరమ్మత్తులకు సంబంధించి విడుదలైన చెక్కులను సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మ నోహర్‌రెడ్డి మజీద్ కమిటీ అధ్యక్షులకు అందజేశారు. ఒక్కొక్కరికి రూ. 8,345 చొప్పున 9 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు తజముల్ అహ్మద్, మజార్, హకీం, పుచ్చుతో పా టు పలువురు నాయకులు, అధికారులు ఉన్నారు.
ముంపు గ్రామంగా ప్రకటించాలి
ఇల్లంతకుంట, అక్టోబర్ 24: మధ్యమానేరు ఏర్పాటులో కందికట్కూరు శివారులో నిర్మిస్తున్న కట్టవల్ల గ్రామానికి ప్రమాదం పొంచిఉందని, దీంతో గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామసర్పంచ్ ఆధ్వర్యంలో గ్రా మస్థులు సోమవారం రాజన్నజిల్లా సంయుక్త కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌తోపాటు ఎంపిటిసి తిరుపతి, మాజీ సర్పంచ్ లు వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎంపిటిసి కిషన్‌రావు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
రెండు ఇసుక అక్రమ ట్రాక్టర్ల పట్టివేత
ఇల్లంతకుంట, అక్టోబర్ 24: పొత్తూరు సమీపానఉన్న మానేరు వాగు నుం చి అక్రమంగా సిద్ధిపేట జిల్లాకు తరలిస్తున్న రెండు ఇసుక అక్రమ ట్రాక్టర్లను ఎస్‌ఐ పాకాల లక్ష్మారెడ్డి సోమవారం పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.