కరీంనగర్

ఎన్‌కౌంటర్ నేపథ్యంలో.. తూర్పున హై అలర్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, అక్టోబర్ 25: ఒడిస్సా రా ష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా అటవీ ప్రాం తంలో పోలీసులకు-మావోయిస్టులకు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తెలుగు రాష్ట్రాల మావోయిస్టు నక్సల్స్ మృత్యువాత పడడంతో మూడు రాష్ట్రాలు తె లంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘ్ఢ్ రా ష్ట్రాల సరిహద్దుల్లో భారీఎత్తున పో లీసు బలగాలను మోహరింపచేశారు. పోలీసు ఉన్నతాధికార యంత్రాంగం ఈమేరకు జయశంకర్ భూపాలపల్లి జి ల్లాలో పర్యటించి హైఅలర్ట్ ప్రకటించారు. మంగళవారం మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ ప్రాంతాన్ని వరంగల్ రేంజీ డీఐజీ రవివర్మ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్, ఓఎస్డీ పుప్పాల రవీందర్, మహాదేవపూర్ డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్‌లు పర్యటించారు. ఎన్‌కౌంటర్‌లో భారీమొత్త ంలో నక్సల్స్ 24 మందితోపాటు మంగళవారం నాటికి మరో ముగ్గురు మృత్యువాత పడ్డట్లు సమాచారం. కా గా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుం చి మరికొంతమంది అగ్ర నాయకులు తప్పించుకున్నట్లు తెలియడంతో వార ంతా సురక్షిత ప్రాంతానికి తరలివెళతారనే అనుమానంతో పోలీసులు తూ ర్పు ప్రాంతమైన గోదావరి నదీ పరీవాహక అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలను పెద్దమొత్తంలో దించి, కూం బింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒ కప్పుడు నక్సల్స్‌కు ఆయువుపట్టుగా ఉన్న మహాదేవపూర్, ఏటూరునాగా రం, మహాముత్తారం ప్రాంతంలో తప్పించుకున్న నక్సల్స్ నాయకులు తలదాచుకుంటారనే అనుమానంతో తూర్పు అటవీ ప్రాంతంలో పోలీసుల ను అలర్ట్ చేశారు. మూడు రాష్ట్రాల పో లీసు ఉన్నతాధికార యంత్రాంగం గో దావరి నదీ పరివాహక ప్రాంతంపై డేగ కనే్నసి ఉంచినట్లు తెలుస్తోంది. గాజర్ల రవి అలియాస్ గణేష్ ఎన్‌కౌంటర్ ను ంచి తప్పించుకున్నట్లు పోలీసులు భా విస్తున్నట్లు సమాచారం. గణేశ్ ఇంతకు ముందు అనేకసార్లు పలు ఎన్‌కౌంటర్ల లో పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించున్నాడు. గణేశ్ మహాదేవపూర్ ఏరియా దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ కార్యదర్శిగా, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఈ ప్రాంతంలో అట్టడుగు వర్గాల క్షేమం కోసం పనిచేసి, వారి హృదయాలలో స్థానం సం పాదించుకున్న గణేశ్ మృత్యువాత ప డ్డాడనే సమాచారాన్ని ఈప్రాంత ప్రజ లు జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పించుకున్న నక్సల్స్ ఈ ప్రాంతానికి రావచ్చుననే అనుమానంతో పోలీసు బలగాలను భారీఎత్తున మొహరించి, కూ ంబింగ్ చేస్తున్నట్లు తెలిసింది. తూర్పు అడవుల్లో మళ్ళీ మావోయిస్టుల ఉనికి పునర్నిర్మాణం జరుగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.