కరీంనగర్

బాల కార్మికులచే పనులు చేయిస్తే కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, నవంబర్ 4: బాల కార్మికులచే ఎవరు పనులు చేయించినా యజమానులపై కేసులు తప్పవని చొప్పదండి సిఐ లక్ష్మీబాబు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మం డల కేంద్రంలోని పాపుడాల ఫ్యాక్టరీలో పనిచేస్తుపట్టుబడిన బాల కార్మికుల వివరాలు వెళ్లడించారు. పాపుడాల ఫ్యాక్టరీలో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన హంగు స్వామి (15), శరత్‌కుమార్ (13) లను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. యజమాని కుట్టికేవల మణికంఠన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం ఇచ్చామని, వారు వచ్చిన తరువాత కేసు నమోదు చేస్తామని తెలిపారు. సిఐ వెంట ఎస్‌ఐ నరేష్‌రెడ్డి, ఎఎస్‌ఐ కరీంలు ఉన్నారు.