కరీంనగర్

రిజిస్ట్రేషన్ శాఖపై పునర్విభజన ఎఫెక్ట్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వీభజన ప్రభావం స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖపై పడింది. పూర్వపు కరీంనగర్ జిల్లాలో క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగగా, నేడు ఆ పరిస్థితు లు తలకిందులయ్యాయి. కరీంనగర్ రిజిష్ట్రార్ పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోగా, ఇప్పటివరకు కనీసం పావలా శాతం కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు. పూర్వ కరీంనగర్ జిల్లా నుండి విడిపోయి నూతనంగా ఏర్పడి న జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జి ల్లాల్లో మాత్రం భూముల క్రయ విక్రయాలు ఊపందుకోగా, కరీంనగర్ జిల్లాలో గణనీయంగా తగ్గిపోయాయి. గతంలో ప్రతినెల 2నుండి 3వేల వరకు రిజిస్ట్రేషన్లు జరిగే కరీంనగర్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ప్రస్తుతం 25శాతం మేర కూడా రిజిస్ట్రేషన్‌లు జరగడం కష్టమవుతోంది. క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ల ద్వారా ఈ శాఖకు అధిక ఆదాయం సమకూరే అవకాశం ఉండగా, సేల్ డీడ్‌లు గణనీయంగా తగ్గిపోవడంతో ఆదాయంపై ప్రభావం చూపుతోంది. కరీంనగర్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ప్రస్తుతం సేల్ డీడ్స్ స్థానే గిప్ట్ డీడ్స్, పార్టీషన్ డీడ్స్, మార్టిగేజ్ డీడ్స్ మాత్రమే రిజిస్ట్రేషన్‌ల కు వస్తుండటంతో పూర్వ కరీంనగర్ జి ల్లాలో తగ్గిపోతున్న ఆదాయాన్ని కొత్త జిల్లాలతో భర్తీచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో రిజిస్ట్రేషన్‌లశాఖ ద్వారా ప్రతి సంవత్సరం రూ. 200 కోట్ల ఆదాయాన్ని గ డించాలన్నది లక్ష్యం కాగా, 50శాతం ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఈ శాఖకు గగనమవుతోంది. మరో ఐదు మాసాల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ల ద్వారా ఈ శాఖకు రూ. 75 కోట్ల ఆదా యం మాత్రమే సమకూర్చుకోగలిగిం ది. ఆదాయం మాటిలా ఉంటే జిల్లాల పునర్వీభజన జరిగినా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం విభజన విషయమై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 సబ్ రి జిష్ట్రార్ కార్యాలయాలు ఉండగా, ఇం దులోని హుస్నాబాద్, భీమదేవరపల్లి శాఖ వరంగల్ అర్బన్ జిల్లాలో విలీనమయ్యాయి. అలాగే మంథని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోని మహదేవ్‌పూర్, కాటారం, మహముత్తారం, మల్హర్ మండలాలు ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. అయితే, ఈ మండలాల రిజిస్ట్రేషన్‌లు నూతన జిల్లా కేంద్రం నుండి జరుగుతాయా ? ములుగు రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి జరుగుతాయా అనేది స్పష్టత లేకుండాపోయింది. జి ల్లాల విభజన అనంతరం కూడా కరీంనగర్ జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయం కరీంనగర్ కేంద్రంగానే పనిచేయను ంది. సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాల పరిధిలోకి వెళ్లిన సబ్ రిజిస్ట్రేషన్‌ల కార్యాలయాలను మినహాయిస్తే పూర్వ కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్, గం గాధర, హుజురాబాద్, సిరిసిల్ల జిల్లా లో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, మల్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. తాజాగా కరీంనగర్‌లో నుంచి కొ న్ని మండలాలను గంగాధర సబ్ రిజిష్ట్రార్‌లలో కలిపినట్లు సమాచారం. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు లేక అధికారులు ఒకరి మొఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి నెలకొనగా, కరీంనగర్‌లోని కొన్ని మండలాలను గంగాధరలో కలపటం వల్ల వీరికి పని అంటూ ఉండే పరిస్థితి లేదు. మొత్తానికి పూర్వ కరీంనగర్ నాలుగు జిల్లాలుగా రూపాంతరం చెందడంతో కొత్త జిల్లాల్లో క్రయవిక్రయాలు ఊపందుకోగా, కరీంనగర్ జిల్లాలో మాత్రం భూముల క్రయవిక్రయాలపై విభజన ప్రభావం భారీగానే పడగా, పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లా శాఖ ఆదాయం భారీగా తగ్గిపోనుంది. ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్లు ఈ మాదిరిగానే కొనసాగితే తమకు కష్టమేనని ప్రైవేట్ దస్తావేజుల లేఖరులు వాపోతున్నారు.