కరీంనగర్

జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, నవంబర్ 13: జిల్లా కేంద్ర అసుపత్రిని ఆదివారం జిల్లా కలెక్టర్ శరత్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. సెలవురోజున కలెక్టర్ అసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడంతో అసుపత్రి నిర్వహనలో అనేక లోపాలు వెలుగు చూసాయి. ఇందులో దాదాపు 18 మం ది వైద్యులకు 7గురు వైద్యులు మాత్రమే విధులకు హాజరుకాగా, మిగతావారు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హజరు కావడంపై కలెక్టర్ అసహానం వ్యక్తం చేసారు. ఇందులో 5గురు వైద్యులు సెలవు విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోగా 12 మంది స్ట్ఫా నర్సులకుగాను ముగ్గురు మాత్రమే విధులకు హాజరవడం జిల్లా కలెక్టర్ అసుపత్రి నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అసుపత్రికి చేరుకున్న కలెక్టర్ నేరుగా సూపరింటెండెంటు ఛాంబర్‌లోకి వెళ్లి వెంటనే సిబ్బందిచే హాజరు రిజిస్టర్‌ను తెప్పించుకోని హాజరు పట్టికను పరిశీలించారు. హాజరు రిజిస్టర్‌లో పెన్సిల్ గీతాలు ఉండడంపై కూడా కలెక్టర్ ఆ గ్రహం వ్యక్తం చేసారు. అనంతరం ఆ సుపత్రిలో విలేకరులతో మాట్లాడిన జిల్లాకలెక్టర్ శరత్ ఇప్పటికైన వైద్యులు పనితనం మార్చుకోవాలన్నారు. సూపరింటెండెంటు డ్యూటీ డాక్టర్‌ను నియమించలేదని, డ్యూటీ డాక్టర్‌గా నియమించినట్లు చెబుతున్న వైద్యుడు కా న్పరెన్స్‌కు వెళ్లినట్లు చెప్పారు. అయితే సదరు వైద్యుడు కూడా మరో డ్యూటి డాక్టర్‌ను నియమించకపోవడం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇంత పెద్ద ఆ సుపత్రికి పోస్టు పిజి వైద్యుడిని డ్యూ టి డాక్టర్‌గా నియమించడం సరైంది కాదన్నారు. డ్యూటీ డాక్టర్‌ను నియమి ంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గైర్హాజరు సిబ్బందిపై జిల్లా వైద్యాధికారి సమగ్ర విచారణ జరిపి ఇ చ్చే నివేదిక అధారంగా గైర్హాజరు వె ద్యులు, స్ట్ఫా నర్సులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌శరత్ పేర్కొన్నారు.

వేగురుపల్లి బ్రిడ్జి నిర్మాణం జూన్ వరకు పూర్తి
* రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్

మానకొండూర్, నవంబర్ 13: మం డల పరిధిలోని వేగురుపల్లి మానేరువాగుపై నూతనంగా నిర్మిస్తున్న వేగురుపల్లి-నీరుకుల్ల గ్రామాల బ్రిడ్జి నిర్మాణం పనులను జూన్‌వరకు పూర్తిచేస్తామని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్, మా నకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. అదివారం వేగురుపల్లిలో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ ప నులను రసమయి బాలకిషన్ పరిశీలి ంచారు. రసమయి మాట్లాడుతూ గత 60 యేళ్లుగా వేగురుపల్లి ప్రజలు కంటున్న కలలను నేర్చిన ఘనత కెసిఆర్‌కే దక్కిందన్నారు. పెద్దపల్లి జిల్లాతోపాటు సుల్తానాబాద్, గోదావరిఖని ప లు మండలకు కరీంనగర్ నుండి వెళ్లా లంటే మండల ప్రజలకు 35 కిలోమీ టర్లు అదనపుభారం ప్రయాణం చే యాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గ త పాలకుల నిర్లక్యం మూలంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేకపోయారని విమర్శించారు. ఎన్నికలకు ముందు వేగురుపల్లి గ్రామప్రజలకు ఇచ్చిన హామీ మే రకు రూ. 50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా బ్రిడ్జి ప్రారంభించనున్నట్లు తెలిపారు.