కరీంనగర్

పదివేల కెమెరాల లక్ష్యంతో ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, నవంబర్ 15: నేరాలను అదుపు చేసి, ప్రశాంతమైన వాతావరణం కల్పించేదుకు ప్రజల సహకారం అవసరమని, దానికి ప్రజలు ముందుకు రావ డం అభినందనేయమని, ప్రజల సహాకారంతో జిల్లాలో పదివేల కెమరాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్దమయ్యాని, దీంతో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా నిలుపుతామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని వరలక్ష్మి పంక్షన్ హాల్‌లో సిఐ లక్ష్మిబాబు నేతృత్వంలో సిసి కెమరాల ఏర్పాటు సమీకరణ ప్రజలు, వ్యాపారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన సదస్సుకు సిపి కమలాసన్ రెడ్డి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. చొప్పదండి పట్టణంలో నేరాల అదుపుకు ఫర్ ఎ సేఫ్ అండ్ స్మార్ట్ పేరిట సిసి కెమరాల ఏర్పాటు చేయడంలో భాగంగా సిపి మాట్లాడుతు నేరాలను అదుపు చేయాలంటే కేవలం పోలీసులతోనే సాధ్యం కాదని, అందుకే ప్రజల సహాకారం అవసరం అవసరం అందుకే ఈ కార్యక్రమానికి సహకరించాలని అన్నారు. నేడు టెక్నాలజీ పెరిగిందని దానికి అనుగునంగా సిసి కెమరాలు ఏర్పాటుతో ఎలాంటి నేరాలనైనా అదుపు చేయవచ్చని అన్నారు. తాను హైదరాబాద్‌లో పని చేసినప్పుడు లక్ష కెమరాలను ఏర్పాటుకు లక్ష్యం పెట్టామని, ఇప్పటికే 10వేల కెమరాలు ఏర్పాటుతో శరవేగంగా సిటీ ముందుకు సాగుతుందని అన్నారు. సిసి కెమరాలతో నేరాలను ఎలా అదుపు చేశామో సిపి చెప్పారు. రాంగోపాల్‌రావుపేట పోలీస్ స్టేషన్ పరిదిలో ఈవ్ టీజింగ్ జరిగితే చిరు వ్యాపారులు చేసుకునే వారు స్వయంగా ఒక్కొక్కరు 5వేల రూపాయలు జమచేసి 8కెమరాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న వారంత స్పందించి ఇప్పటికే 10వేలు కెమరాలు పూర్తయ్యాయని తెలిపారు. ఒక్క కెమరా 20మంది పోలీసులతో సమానమన్నారు. అలాగే కెమరా సిసి పుటేజిల్లో రికార్డు ద్వారా నేరస్తులను గుర్తించడం ద్వారా కోర్టులో సాక్షులు అవసరం ఉండదని, తద్వారా నేరం నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదన్నారు. చిన్న క్లూ ద్వారా చొప్పదండి ఎస్‌బిఐ బ్యాంక్ దోపిడి అంతర్జాతీయ ఉగ్రవాదులను గుర్తించడం జరిగిందని తెలిపారు. చొప్పదండిలో 30కెమరాల ఏర్పాటుకు 25లక్షలు ఖర్చు అవుతుందని, దీనికి ముందుకు రావడంతో లక్ష్య నెరవేరతుందన్న నమ్మకం కలిగిందని, చొప్పదండిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో 16 మండలాలను గుర్తించామని, 10వేల కెమరాలు ఏర్పాటు చేస్తామనే లక్ష్యాన్ని తీసుకున్నామన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో కాలనీవాసులే కమ్యూనిటీగా ఏర్పడి సిసి కెమరాలు ఏర్పాటు చేసుకోవడం జరగుతుందని ఎన్‌ఆర్‌ఐ ఇప్పనపల్లి హరికిషన్ చెప్పిన విషయాలను ఆచరణలో పెడుతున్నామన్నారు. సిసి కెమరాల్లో గుర్తింపబడిన వారు తప్పనిసరిగా ఏదో రకంగా పట్టుబడటానికి అవకాశం ఉందన్నానరు. నేరస్తుడు తప్పించుకోవడానికి అవకాశం లేదన్నారు. సిసి కెమరాలు నాణ్యతతో, అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ కలిగి ఎక్కువ దూరం కవరేజ్ చేస్తు, నెలరోజుల వరకు జరిగిన రివ్యూను చూసుకోవచ్చన్నారు.