కరీంనగర్

గోదావరి మహాహారతికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, నవంబర్ 17: ధర్మపురిలో ఈ నెల 20న నిర్వహించే గోదావరి మహాహారతిని విజయవంతం చేయడంలో భాగంగా కొనసాగుతున్న గోదావరి మహాహారతి చైతన్య రథాని కి గురువారం చొప్పదండి, చిట్యాలపల్లిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటి రాష్ట్ర కన్వీనర్ లింగంపల్లి వీరగోపాల్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పిలువబడుతున్న ధర్మపురిలో గత నాలుగేళ్లుగా ప్రతీ ఏడాది ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని, అత్యంత ప్రాధాన్యత కలిగిన గోదావరి మహాహారతిలో అధిక సంఖ్యలోప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో విహెచ్‌పి మండల అధ్యక్షుడు పడకంటి కృష్ణ, కాపర్తి మల్లిఖార్జున్, చేపూరి సత్యనారాయణ, మడుపు నరేందర్, బల్మూరి సత్యనారాయణ రావు, దండె రాజయ్య, గుర్రం ఏసురెడ్డి, దండె రవీందర్, లింగంపల్లి కిషన్, సిరిపురం సత్యనారాయణ, పడకంటి రాజు, కొక్కుల వెంకన్న, వెంకటయ్య, సరోజన, పర్శరాం, బాపు పాల్గొన్నారు.