కరీంనగర్

ఘనంగా ‘దీక్షా దివస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 29: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం, అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ నవంబర్ 29న అమరణదీక్ష చేపట్టిన రో జును పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో టిఆర్‌ఎస్, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో దీక్షా దివస్ పేరిట పలు సేవా, ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. గులాబీ శ్రేణు లు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, రక్తదాన శిబిరాలు, అనాధాశ్రమాల్లో పండ్ల పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు, కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ముఖ్య నేతలు దీక్షాదివస్ కార్యక్రమాలను ప్రా రంభించగా, కరీంనగర్‌లోని తెలంగా ణ చౌక్‌లో చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ప్రారంభించగా, సాయంత్రం మంత్రి ఈటెల రాజేందర్ దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఏలాగైతే ఉద్యమస్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అదే స్పూర్తితో బంగారు తెలంగాణను నిర్మించుకుందామన్నారు. కెసిఆర్ దీక్షవల్లే తెలంగా ణ సాకారమైందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడిన కెసిఆర్ పోరాట పటిమ, కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, ఎమ్మెల్యే బొడిగె శోభ, నాయకులు అక్బర్ హుస్సేన్, కట్ల సతీష్, సునీల్‌రావు, పెద్దపల్లి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే సింగరేణి వారసత్వ ఉద్యోగాల సర్క్యులర్
* కార్మికులు ఎలాంటి అపోహలకు గురికావద్దు * టిబిజికెఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
యైటింక్లయిన్ కాలనీ, నవంబర్ 29: వారం రోజుల్లో సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై సర్క్యూలర్ జారీ అయ్యే అవకాశం ఉందని టిబిజికెఎస్ అధ్యక్షులు బి.వెంకట్రావ్ తెలిపారు. మంగళవారం ఆర్జీ-2 ఓసిపి-3 వద్ద టిబిజికెఎస్ గేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీ య సంఘాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ప్రకటించిన ముఖ్య మంత్రి కెసిఆర్‌ను కార్మికులు దేవునిగా కొలుస్తున్నారని అన్నారు. ప్రాంతీయ సంఘమైన టిబిజికె ఎస్ వారసత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల జాతీయ సంఘాలు జీర్ణించుకోలేకనే అసత్యపు ప్రచారాలు చేస్తూ కార్మికులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. దీన్ని కార్మికులు గమనించాలని, ఎలాంటి అపోహలకు లోనవద్దని కోరారు. అందరికి వారసత్వ ఉద్యోగం వర్తించేలా, రిటైర్డ్ కార్మికులకు సకల జనుల సమ్మె వేతనాలు త్వరగా వచ్చేలా ముఖ్యమంత్రికి మరోసారి విన్నవిస్తామని అన్నారు. జాతీయ సంఘాలకు తగిన గుణ పాఠం చెప్పాలని, నిరంతరం కార్మిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే టిబిజికెఎస్‌ను రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కార్మికులను కోరారు. సమావేశంలో ఐలి శ్రీనివాస్, రామమూర్తి, శంకర్ నాయక్, సత్యనారాయణ రెడ్డి, సురేష్, సదయ్య, రావుల సత్యనారాయణ, కనకయ్య, నాగేశ్వర్ రావు, బేబి చంద్రయ్య, ఫిరంగి శ్రీనివాస్ తదితరులున్నారు.

కోర్టు కానిస్టేబుళ్ల
నియామకాల్లో మార్పులు
* కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకం
* పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, నవంబర్ 29: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న కోర్టు కానిస్టేబుళ్ల నియామకాల్లో సమూలంగా మార్పు జరిగింది. దీర్ఘకాలంగా వివిధ పోలీస్ స్టేషన్ల నుండి కోర్టుల వ్యవహారాలను చూస్తున్న కానిస్టేబుళ్లను సదరు విధుల నుండి తప్పించారు. కేసుల విచారణల్లో జాప్యాన్ని నివారించడంతో పాటు కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు కమీషనర్ ఆదేశాల మేరకు ఈ మార్పులు జరిగాయి. నూతనంగా ఆయా పోలీస్ స్టేషన్ల నుండి నియామకమైన కోర్టు కానిస్టేబుళ్లకు కోర్టు విధులపై అవగాహన కల్పిస్తూ మంగళవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని దివంగత ఉమేశ్‌చంద్ర కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ కేసుల విచారణ వేగవంతంగా కొనసాగడంతో పాటు వివిధ రకాల కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేపట్టే చర్యల్లో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమన్నారు. క్రమశిక్షణతో మెదులుతూ అంకితభావంతో విధులను నిర్వర్తించే పోలీసులకు నగదు రివార్డులను అందజేస్తామని ప్రకటించారు. వివిధ రకాల కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కోర్టు విధులపై వారం రోజుల్లో తర్పీదు పొందాలని చెప్పారు. సాక్షులు తప్పనిసరిగా హాజరయ్యేలా కౌన్సిలింగ్ చేపట్టాలని కమలాసన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ సిపి అన్నపూర్ణ, ఎసిపి రామారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంరెడ్డిలతో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా పంచ సహస్ర దీపారాధన
* ఘనంగా కార్తీకానికి వీడ్కోలు

ధర్మపురి, నవంబర్ 29: కార్తీక బహుళ అమావాస్య పర్వదిన సందర్భంగా, ధర్మపురి క్షేత్రంలో గోదావరి వద్ద కార్తీక దీపారాధనా మహోత్సవం మంగళవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. కార్తీకమాస చివరి రోజైన అమావాస్య అపురూప సన్నివేశ నేపథ్యంలో దేవస్థాన ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ రూపశిల్పిగా, వినూత్నంగా క్షేత్రంలో ఏర్పాటు చేసిన, అరుదైన, అపురూప సన్నివేశ సందర్భంగా మంగళవారం సాయంత్రం 3గంటలనుండి శ్రమించి ఏర్పాటు చేసిన వేలాది దీపాలంకరణలకు అనూహ్య స్పందన లభించింది. దేవస్థానం ఆధ్వర్యంలో, స్థానిక పంచాయతి సౌజన్యంతో, దేవస్థానం ఎసి, ఇఓ సుప్రియ మార్గదర్వకత్వంలో, సర్పంచ్ సంగి సత్తమ్మ ప్రత్యక్ష పర్యవేక్షణలో, ప్రధానార్చకలు రఘునాథాచార్య, ఆలయాల అర్చకులు శ్రీనివాసాచార్య, ప్రవీణ్ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, సంపత్ శర్మ, వేదపండితులు, వందలాదిమంది మంది భక్తుల భాగస్వామ్యంతో, మహిళలు, విద్యార్థుల సహకారంతో కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అపురూపంగా గోదావరి నది మెట్లపై మంగలి గడ్డ విఐపి ఘాట్‌పై నుండి గోదావరి నీటివరకూ వివిధ ఆకృతులతో, ఏర్పా టు గావించిన దీప కాంతులతో కార్తీక మాసోత్సవ వేడుకలకు ముగింపు పలికిన, పౌరాణిక ప్రాధాన్యతను సంతరించుకున్న అపూర్వ ఘట్టాన్ని అశేష భక్తజనం కన్నులారా గాంచి తరించారు. మునుముందుగా గోదావరి నదీ జలాలను పూజించి, గోదావరిమాతను అర్థించి, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, అర్చక పురోహితులు పాలెపు ప్రవీణ్, ప్రధానార్చకులు రఘునాథాచార్య, ఉప ప్రధానార్చకులు శ్రీనివాసాచార్య నేతృత్వంలో, ఆలయాల అర్చకులు, వేద మూర్తులు సాంప్రదాయ పద్దతిలో విధివిధానంగా కలశ గణపతి పూజ, పుణ్యాహవాచనంతో ప్రారంభించి విశేష పూజలు గావించిన అనంతరం జగిత్యాల కలెక్టర్ సతీమణి పార్వతి, ఇఓ సుప్రియ, సర్పంచ్ సత్తమ్మ లాంఛనంగా ప్రారంభించగా, వందలాది మంది భక్తులు దీపాలను వెలిగించారు.

మోదీ చిత్రపటానికి పంచామృతాభిషేకం

హుజూరాబాద్, నవంబర్ 29: ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు మంగళవారం పంచామృతాభిషేకం చేశారు. సోమవారం హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు నోట్ల రద్దును నిరసిస్తూ మోడీ చిత్రపటానికి దగ్దం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. దీన్ని నిరసిస్తూ బిజెపి నాయకులు మోడీ చిత్రపటానికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ బిజెపి నాయకులు నందగిరి మహేందర్‌రెడ్డి, జెల్ల సుధాకర్, మాడుగుల ప్రవీణ్‌కుమార్‌లు విలేకర్లతో మాట్లాడుతూ కాం గ్రెస్ నాయకులు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని, వారివద్ద నల్ల ధనం ఉన్నందువల్లే మోడీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మోడీ సా మాన్య ప్రజలకు, పేదలకు న్యాయం చేసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశారని, నల్ల కుబేరులను దెబ్బ తీసేందుకు బిజెపి ప్రభుత్వం కృషిచేస్తోందని, దీనికి సహకరించాల్సిందిపోయి మో డీని బిజెపిని విమర్శించడం అర్థరహితమన్నారు. సామాన్యులు, పేదలు నోట్ల రద్దుకు సహకరిస్తున్నారని, రాబోయే కాలంలో మోడీ నకిలీ కరెన్సీతో, నల్ల ధనంతో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతారని, పేద వారి అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేస్తారని వారన్నారు. మోడీ గొప్ప దేశభక్తుడని, ఆయనకు ఆస్తులు లేవని, గతంలో ఏ ప్రధాని చేయని పనులు మోడీ చేస్తున్నారని, ప్రజలంతా మోడీ వైపే ఉన్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు నల్లాని నరేందర్‌రావు, జంపాల రాజు, యాంసాని శశిధర్, మోటపోతుల పద్మ, కొలిపాక శ్రీనివాస్, మురికి శ్రీనివాస్, సబ్బని రమేష్, రావుల వేణు, గంగిశెట్టి ప్రభాకర్, గాలి సమ్మయ్య, లక్ష్మణ్‌రావు, నగేష్, కేశవ్, తదితరులు పాల్గొన్నారు.

కాలువను పరిశీలించిన అధికారులు
ఎలిగేడు, నవంబర్ 29: ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌లో 14-ఎల్ కెనాల్‌లో ఉపాధిహామీ కూలీలు చేపట్టిన మట్టి షిల్ట్ పనులను మంగళవారం ఎంపిపి లక్ష్మి, సర్పంచ్ అనీత, ఎస్సారెస్పీ డిఇ మధుమతి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1వ తేదీ నుండి నీటిని విడుదల చేస్తారని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. కాలువ పక్కన ప్రమాదకరంగా ఉన్న బావిని పరిశీలించారు. వారి వెంట టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తానిపర్తి మోహన్ రావు, నాయకులు పెద్ది సమ్మయ్య, కవ్వంపల్లి దుర్గయ్య, రైతు మల్లారపు మల్లేశం, ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య, లస్కర్లు, ఉపాధిహామీ కూలీలు తదితరులు ఉన్నారు.
తల్లిదండ్రులు కరుణ చూపాలి
* తహశీల్దార్ రజిత
సుల్తానాబాద్, నవంబర్ 29: ప్రత్యేక అవసరాలుగల పిల్లలు, వికలాంగుల పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కరుణ చూపాలని తహశీల్దార్ అంబటి రజిత అన్నారు. మంగళవారం మండల కేంధ్రంలోని విద్యావనరుల కేంద్రంలో విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో తహశీల్దార్ మాట్లాడుతూ చెవులు వినపడనివారు, కంటిచూపు సక్రమంగా లేనివారు, ఇతర వికలాంగులపట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల విద్యాధికారి నర్సింగం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న వికలాంగుల పట్ల ప్రత్యేక అవసరాలుగల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. ఈ సమావేశంలో రిసోర్స్ పర్సన్స్ సత్తయ్య, కరుణశ్రీ పలువురు పాల్గొన్నారు.
దీక్షాదివస్‌కు తరలివెళ్లిన జాగృతి నాయకులు
సుల్తానాబాద్, నవంబర్ 29: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మంగళవారం జరిగిన దీక్షా దివస్‌కు 2009 మందితో నిర్వహించే దీక్షలో పాల్గొనడానికి జాగృతి పెద్దపల్లి నియోజకవర్గ కన్వీనర్ గండు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పలువురు తరలివెళ్లారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి జాగృతి అన్ని విభాగాల నాయకులు తరలివెళ్లారు. కన్వీనర్ కృష్ణమూర్తి జెండా ఊపి వాహనాల యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మదుసూధన్ రెడ్డి, ఎలిగేడు, శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల అధ్యక్షులు కాసర్ల మహేందర్, హరికృష్ణ, మల్లిఖార్జున్ రావు, టిజెవైఎఫ్ కన్వీనర్ శ్రీనివాస్, దిలీప్, టిజెఎస్‌ఎఫ్ నాయకులు సాయిరాం, మనోజ్, గర్రెపల్లి నుండి మార్క అనీల్ గౌడ్‌తో పాటు పలువురు హైదరాబాద్ తరలివెళ్లారు.
విశ్వబ్రాహ్మణులకు సబ్సిడీ అందించాలి
* సంఘం మండల శాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు
సుల్తానాబాద్, నవంబర్ 29: విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వం నుండి వచ్చే సబి సడీ రావడం లేదని మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దాసోహం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో సమావేశం జరిగింది. ఇందులో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులందరికి చేసిన పనికి తగిన కూలీ రేట్లు దొరకడం లేదని, పనులు లేక ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నారని, ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ వెంటనే అందించి విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు. విశ్వబ్రహ్మణులందరు కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీమంతుల సంపత్, ఏకశిల శ్రీనివాస్, పూసాల ఆంజనేయులు, శ్రీమంతుల సదానందం, ప్రభాకర్, దాసోహం ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
నారాయణపల్లిలో దొంగతనం
ఎలిగేడు, నవంబర్ 29: ఎలిగేడు అనుబంధ గ్రామమైన నారాయణపల్లిలో సోమవారం రాత్రి సబ్బు రాజమ్మ అనే వృద్ధురాలి ఇంటిలో గుర్తు తెలియని దుండగులు రెండు తులాల బంగారం గొలుసు, 12 తులాల వెండి, 600 రూపాయల నగదును దొంగిలించినట్లు జూలపల్లి ఎస్‌ఐ దేవేందర్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు..రాజమ్మ సోమవారం రాత్రి బహిర్భూమికి బయటికి వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రేకుల షెడ్డులోని బీరువా నుంచి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. మంగళవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పొత్తూరులో వాహనాల తనిఖీ
ఇల్లంతకుంట, నవంబర్ 29: బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే కార్యక్రమం ఉన్నందున మంగళవారం సాయంత్రం ముందస్తు చర్యగా ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తన బృందంతో వాహనాల తనిఖీ నిర్వహించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కార్యక్రమం రూటును పరిశీలించారు. లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బండికి సంబంధించిన కాగితాలు లేని వాహనాలను పట్టుకొని జరిమానా విధించారు.
కరెంట్ షాక్‌తో మహిళ మృతి
శంకరపట్నం, నవంబర్ 29: మండలంలోని కొత్తగట్టు గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్‌తో ఓ మహిళ మృతి చెందింది. పోతరవేని సరోజన (35) అనే మహిళ తన సొంత వ్యవసాయ బావి వద్ద ఒడ్డు గడ్డపారతో తవ్వుతుండగా తెగిపోయిన విద్యుత్ వైరు గడ్డపారకు తగలడంతో సరోజన విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ ఎల్.శ్రీను తెలిపారు.