కరీంనగర్

జడ్పీటీసీలకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 3: నిధుల కొరతతో నీరసించిన జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులకు ఊరట లభించబోతుంది. గత కొన్నాళ్ళుగా పెండింగ్‌లో ఉన్న సీనరేజీ నిధులను జిల్లా పరిషత్‌లకు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు రూ.11.7కోట్లు మంజూరుకు చర్యలు కూడా తీసుకుంది. ఈమొత్తం నేడో రేపో జడ్పీ ఖాతాలో చేరనుండగా, నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న జిల్లా పరిషత్ సభ్యులకు సీనరేజీ నిధుల విడుదల టానిక్‌లా పనిచేయబోతుంది. స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసే నిధులు జడ్పీల ద్వారా మాత్రమే క్షేత్ర స్థాయికి చేరేవి. వీటితోపాటు ఇతరత్రా, రాష్ట్ర ప్రభుత్వం అందించే మొత్తం కూడా జిల్లాపరిషత్‌ల నుంచే విడుదలయ్యేవి. అయితే, ఈసారి ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించటంతో జిల్లా పరిషత్ సభ్యులకు అభివృద్ధి నిధుల రాక నిలిచింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కేంద్రం స్థానిక సంస్థలకు అందించే అభివృద్ధి నిధులను నేరుగా పంచాయతీలకే అందజేస్తుండటం జిల్లా పరిషత్‌లకు ఆశనిపాతంలా మారింది. దీనికితోడు 13,14వ ఆర్థిక నిధులను కూడా నేరుగా పంచాయతీలకు అందజేస్తుంది. దీంతో మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధిలో కనీస ప్రాతినిత్యం లేక జడ్పీటిసిలు నామ్‌కేవాస్తేగా మిగిలారు. వారికి రావాల్సిన వేతనాలు కూడా గత ఆరేడు, మాసాలుగా నిధుల్లేక పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీనిపై జడ్పీటిసిలు పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. జిల్లాల్లోని ఇసుక, గ్రానైట్ క్వారీలనుంచి వసూలు చేస్తున్న సీనరేజీ నిధుల్లో జిల్లాలకు అందజేసే శాతాన్ని విడుదల చేయాలని కోరారు. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీనరేజీ నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సిఎం కెసిఆర్ కూడా పచ్చజెండా ఊపటంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. దీంతోనిన్నటిదాకా అధికారుల పనితీరుపై గళమెత్తిన జడ్పీసభ్యులు తాజాగా తమ తమ మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్దిపనుల చిట్టావిప్పేందుకు సిద్దమవుతున్నారు. అయితే, జిల్లాకు విడుదలయ్యే ఈమొత్తంనుంచి గతకొంతకాలంగా జడ్పీసభ్యులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేసిన అనంతరం మిగిలనున్న నిధులను ప్రాధాన్యతాక్రమంలో అభివృద్దిపనులకు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది.