కరీంనగర్

‘షీ’ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర (కరీంనగర్), డిసెంబర్ 22: పోకిరీల వేదింపులకు గురవుతున్న మహిళలు, విద్యార్థినులు ‘షీ’ టీం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. కమీషనరేట్ పరిధిలో షీ టీములను బలోపేతం చేయడం జరిగిందని పేర్కొన్నారు. పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు ముఖ్య కూడళ్లలో షీ టీములు మఫ్టీలో సంచరిస్తున్నాయని తెలిపారు. వేధింపులకు గురిచేస్తున్న ఆధారాలను సేకరించేందుకు అత్యాధునిక పరికరాలను షీ టీములకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. వేదింపులకు గు రి చేసేవారిని అదుపులోకి తీసుకొని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తామని, పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లయితే కేసులు నమోదు చేయడ మే కాకుండా రౌడీషీట్‌లను తెరుస్తామని హెచ్చరించారు. నేరుగా వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి లేనట్లయితే 9440795182 నెంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

ఓటరు దినోత్సవంపై విస్తృత అవగాహన
* వంద శాతం లక్ష్యసాధన, వారోత్సవాలు నిర్వహిస్తాం * కలెక్టర్ కృష్ణ్భాస్కర్

సిరిసిల్ల, డిసెంబర్ 22: వచ్చే జనవరి 25న ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలతోపాటు, అవగాహన కలవ్పిస్తామని జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్ అ న్నారు. గురువారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లతో ఓటరు దినత్సవంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అ ధికారి మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ఓటుహక్కు నమోదుపై అవగాహన కల్పించాలని, ముఖ్యంగా ప్రాధమిక విదార్థి స్థాయి నుండి డిగ్రీ స్థాయి వరకుగల విద్యార్థులందరికీ ఓటు హక్కుపై అవగాహన కల్పించి చైతన్య పర్చాలన్నారు. ఉపన్యాస, వ్యాస, రచన పోటీలు, రంగోలి, క్రికెట్ వంటి పోటీలను నిర్వహించాలన్నారు. జనవరి 26న ప్రత్యేకంగా శకటాన్ని తయారు చేసి ప్రదర్శించాలని, వివిధ పోటీలలో గెలుపొందిన వారికి మహుమతులను అందించాలన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను అందచేయాలన్నారు. ర్యాలీ లు నిర్వహించి, అందులో విద్యార్థుల ను, ప్రజాప్రతినిధులను, సీనియర్ సిటిజన్స్, ప్రతిఒక్కరు పాల్గొనే విధం గా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తామని, జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రతిఒక్కరిని భాగస్వాములు చేస్తామన్నారు. ఓటరు నమోదు, అవగాహన వంద శాతం చేస్తామన్నారు. బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జూనియర్, సీనియర్ స్థాయిల్లో వ్యాస, వకృత్వ, పేయింటింగ్, క్రికెట్, రంగోలి పోటీల ను నిర్వహించి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. కవి సమ్మేళనాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డిఆర్వో శ్యాంప్రసాద్‌లా ల్, తహశీల్దార్ రాజులు పాల్గొన్నారు.