కరీంనగర్

బహుముఖ ప్రజ్ఞాశాలి పాములపర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, డిసెంబర్ 22: భారత ప్ర ధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి దక్షిణాత్యుడు, ఒకేఒక తెలుగువాడు పాములపర్తి వెంకట నరసింహారావు జూన్ 28న జన్మించి, డిసెంబర్ 23న మరణించారు. పివిగా లబ్దప్రతిష్ఠులైన ఆయన బహు భాషావేత్త, రచయిత. అపరచాణుక్యునిగా పేరొందారు. భా రత ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న మేధావి. 1957లో శాసనసభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన పివి రాష్టమ్రంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేం ద్ర మంత్రిగా, చివరకు ప్రధానిగా తన మేధాశక్తితో క్రమానుగతంగా ఉన్నత పదవులను కైవసం చేసుకున్న రాజనీతిజ్ఞుడాయన. కాంగ్రెస్ హయాంలో పూ ర్తి సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాకచక్యంతో, పూర్తికాలం నడిపించారు. 1957లో మంథని నుం డి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా నాలుగుసార్లు గెలిచారు. 1962లో మొదటి సారి రాష్టమ్రంత్రియై, 62నుండి 64 వరకు న్యాయ, సమాచార మంత్రిగా, 64నుండి 67వరకు దేవాదాయ,న్యాయ; 67లో వైద్యఆరోగ్య, 68నుండి 71 వరకు న్యాయ, సమాచార శాఖలను ని ర్వహించారు. ముఖ్యమంత్రిగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. పీఠ ం అధిష్ఠించగానే అసమ్మతి. ఈ విషయమై అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీ-హైదరాబాద్‌లమధ్య తిరిగేందుకే సరిపోయింది. పట్టణ భూగరిష్ఠ చట్టా న్ని తెచ్చిందీ ఆయనే. తర్వాత ఆయన కార్యక్షేత్రం ఢిల్లీకి మారింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శిగా, మొదటిసారి హ న్మకొండనుండి లోకసభకు ఎన్నికైనా రు.
ఎనిమిది, తొమ్మదివ లోకసభలకు రాంటెక్ నుండి ఎన్నికైనారు. నంద్యాల ద్వారా ఉపఎన్నికలో ఎన్నికై 10వ లోకసభలో అడుగిడి, 1980-81కాలంలో కేంద్ర హోం, విదేశీ వ్యవహారాలు, మా నవవనరుల అభివృద్ధి శాఖలు చేపట్టా రు. రాజీవ్ హత్య కారణంగా, 1991లో సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా ఆయన హయాంలో ఎన్నో మలుపులు...అవినీతి ఆరోపణలూ ఎదుర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసంచేపట్టిన సంస్కరణలు, మన్మోహన్‌సింగ్‌ను పిలిచి ఆర్థికమంత్రిని చే యడం ఆయనకే చెల్లింది. పంజాబ్ తీ వ్రవాదాన్ని అణచివేసిందీ ఆయన ప్ర భుత్వమే. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు,వారి డి మాండ్లను లెక్కపెట్టక బందీలను పిడిపించిన ఘనతా ఆయనదే. ఇజ్రాయిల్ తో దౌత్య సంబందాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బ యటపెట్టి ఆగ్నేయాసియా దేశాలతో సత్సందాలను కలిగిఉండడం పివి ప్ర భుత్వం సాధించిన విజయమే. బహుభాషా పండితులు, 17్భషలలో అలవోకగా, మాట్లాడగలిగిన మేధావి. 19 83లో స్పానిష్ భాషలో ప్రసంగించి, అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో క్యూబా అధ్యక్షులు ఫీడెల్‌ను అబ్బుర పరిచిన గొప్పతనం ఆయనది. నిరాడంబరుడు, తన పిల్లలను సైతం ప్ర ధాని కార్యాలయానికి దూరంగా ఉం చిన నిజాయితీపరుడు, చివరి దశలో కోర్టులకు తిరగడానికి ఆస్తులను అ మ్ముకున్నవ్యక్తి. 2004 డిసెంబర్ 23న తుదిశ్వాస వదిలారు. తెలంగాణలో పివి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయం.