కరీంనగర్

‘మిషన్ భగీరథ’లో నాణ్యతా ప్రమాణాలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్, జనవరి 1: ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించే మిషన్ భగీరథ పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం ఉదయం మంత్రి తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండిలో నిర్వహిస్తున్న మీషన్ భగీరథ పనులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిందని అన్నారు. పాత కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ 5విడుతల్లో త్రాగునీరు అందిస్తామని తెలిపారు. జనవరి 2017లో 1వ విడ త, మార్చి లో రెండవ విడత, జూన్, జూలైలలో 3వ విడత, సెప్టెంబర్, అక్టోబర్‌లలో 4వ విడత, డిసెంబర్ నెలలో 5విడతలో ప్రజలందరికీ త్రాగునీరు అందిస్తామని వివరించారు. మిషన్ భగీరథ పనులన్ని నిర్ణయించిన గడువు ప్రకారం నడుస్తున్నాయన్నారు. ఎలగందల్, ఎల్‌ఎండిలలో ఫిల్టర్ బెడ్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇవి పూర్తి అయితేనే నీరు ఇవ్వడానికి వీలు అవుతుందన్నారు. మిష న్ భగీరథ పైపులైన్ల నిర్మాణానికి రైతాంగం సహకరించాలని కోరారు. జాతీయ రహదారులు, రోడ్ల ప్రక్కన వేసే పైపులైన్లు ముందు చూపుతో రోడ్లకు దూరంగా ఉండేలా వేయాలని అన్నారు. పైపు లైన్ల నిర్మాణంలో ఎవరి ఆస్థులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటూ పైపులైన్లు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అధికారులు ఎస్‌ఈ శ్రీనివాస్, నాయకు లు ఉల్లెంగుల ఏకానందం, ఎంపిపి బూడిద ప్రేమలత, కరీంనగర్ మార్కెట్ కమిటి చైర్మన్ గోగూరి నర్సింహారెడ్డి, సర్పంచులు మాతంగి స్వరూప, చిందం కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి
సిరిసిల్ల, జనవరి 1: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు, వివిధ వర్గాల ప్రజలు, పలువురు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అం దజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖంగా సమృద్ధి పంటలతో నూతన ఒరవడితో జీవించాలని అన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎస్పీ విశ్వజిత్ జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, డిఆర్‌ఓ శ్యాంప్రసాద్‌లాల్, తహశీల్దార్‌లు, సిరిసిల్ల అర్భన్ బ్యాంక్ ఉద్యోగులు, ప్రతినిధులు పాల్గొనగా, తహశీల్దార్‌ల సంఘం 2017 సంవత్సరం క్యాలెండర్‌లను కలెక్టర్ ఆవిష్కరించారు.