కరీంనగర్

చిరకాలం గుర్తుండే సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమాన్‌పూర్, జనవరి 2: తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుండే సిఎం కెసిఆరేనని ప్రభుత్వ ముఖ్య సలహాదారు గడ్డం వివేక్ అన్నారు. సోమవారం కమాన్‌పూర్ మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు దాసరి రాయలింగు ఆధ్వర్యంలో వివేక్ కు, ఎమ్మెల్యే పుట్ట మధుకు సన్మాన సభ ను ఏర్పాటు చేశారు. వివేక్‌ను, పుట్ట మధును ఎంపిపి ఇనగంటి ప్రేమలత, జడ్పిటిసి మేకల సంపత్, సర్పంచ్‌లు కొంతం సత్యం, ఆకుల గట్టయ్యతోపా టు కందుల సంధ్యారాణి, మూల సరోజన, గంట వెంకటరమణారెడ్డి, మిర్యా ల రాజిరెడ్డి, పీట్ల గోపాల్, ఇనగంటి రామారావు, మల్క రామస్వామి, కిషన్ రెడ్డి, వైనాల రాజు, దేవీ లక్ష్మీనర్సయ్య తదితరులు ఘనంగా సన్మానించారు. వివేక్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రజల్లో చి రకాలం గుర్తుండేలా తెలంగాణలో అ భివృద్ధి పనులు చేస్తున్నారని, దీనిలో భాగంగానే కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తీసుకురావడం గొప్ప విషయమన్నారు. రైతులకు రెండు పంటలు పండేలా తెలంగాణ ను సస్యశ్యామలం చేసేలా ప్రాజెక్ట్‌లను నిర్మించడం జరుగుతుందని, నిర్వాసిత రైతులు భూములను స్వచ్ఛందంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా రైతులకు రుణమాఫీ చేసిందని, ఇంకోభాగం ఈ ఫిబ్రవరిలో చేయనుందన్నారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేలా కెసిఆర్ చేశారని స్పష్టం చేశారు.

వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలి
* జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ టౌన్, జనవరి 2: ప్రభుత్వ ఉద్యోగులు వారానికి ఒకరోజు సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర అమ్మకపు స్టాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఉద్యోగు లు, ప్రజాప్రతినిధులు తప్పకుండా ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారని తెలిపారు. ఆయన పిలుపుమేరకు జిల్లాలోనివారు కూడా చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు.