కరీంనగర్

దేవస్థానంలో ప్రముఖుల పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జనవరి 8: దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆదివారం ఉదయాత్పూర్వం పలువురు ప్రముఖులు విశేష పూజాదులలో పాల్గొన్నారు. పీఠాధిపతులు సచ్చితానంద సరస్వతి స్వామి, శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ, దేవాదాయ మంత్ర ఇంద్రకరణ్ రెడ్డి, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు వివేక్, జడ్పి చైర్మన్ పర్సన్ ఉమ, ఎంపీ సుమన్, జగిత్యాల, పెద్దపెల్లి కలెక్టర్లు శరత్, వర్షిణి, జిల్లా ఎస్పీ అనంత శర్మ, తదితరులు పూజాదికాలలో పాల్గొన్నారు.

క్యాష్‌లెస్‌పై హోంశాఖ సెక్రటరీ సైకిల్ యాత్ర
* కరీంనగర్ చేరుకున్న రాజీవ్ త్రివేది
*ఘన స్వాగతం పలికిన
పోలీసు అధికారులు
*క్యాష్‌లెస్ లావాదేవీలతో
అవినీతి నిర్మూలన
*హోంశాఖ సెక్రటరీ రాజీవ్ త్రివేది స్పష్టం

కరీంనగర్, జనవరి 8: నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజిపి రాజీవ్ త్రివేది తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం మధ్యా హ్నం వరకు కరీంనగర్ జిల్లాకు చేరుకుంది. తిమ్మపూర్ మండలంలోని వాగేశ్వరి, జ్యోతిష్మతి, శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలల వద్ద విద్యార్థినీ, విద్యార్థులు రాజీవ్‌త్రివేదికి ఘనంగా స్వాగతం పలికారు. కరీంనగర్ నగరానికి చేరుకోగానే రాజీవ్ త్రివేదికి పోలీసు కమీషనర్ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ సిపి అన్నపూర్ణతోపాటు పలువురు పోలీసు అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని ఓపెన్ ఏయిర్ థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజీవ్ త్రివేది మాట్లాడుతూ నగదు రహిద లావాదేవీల వల్ల అవినీతి నిర్మూలించబడుతుందని అన్నారు. దేశాభివృద్ధిలో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పటిష్ట ఆర్థిక వ్యవస్థ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎక్కువ శాతం మంది ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. కరీంనగర్ సిపి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీల కొనసాగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని, రాబోయే రోజుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల అవసరం లేకుండానే లావాదేవీలు కొనసాగించే దిశగా ముం దుకు సాగుతున్నదని అన్నారు. నగదు రహిత లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కమీషనరేట్ పరిధిలోని అన్ని స్థాయిలకు చెందిన పోలీసులకు నగదు రహి త లావాదేవీలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ సిపి అన్నపూర్ణ, మున్పిపల్ కమీషనర్ శశాంక, డిఆర్వో అయేషామస్రత్ ఖాన్, వ్యాపా ర, మునీందర్, భాస్కర్, అంజయ్య, శంకర్, శ్రీనివాస్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కరీంనగర్ టౌన్, జనవరి 8: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటె ల రాజేందర్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో అనారోగ్యాల బారినపడిన పేద ప్రజలకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 46 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.16లక్షల చెక్కులను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రి లో చేరి చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆర్ధికంగా ఆదుకునేందుకు సిఎం సహా య నిధి నుండి నిధులు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ప్రజలందరు సంపూర్ణ ఆరోగ్యంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 8మండలాలకు చెందిన 46 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయ చెక్కులను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎంపి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావులతోపాటు పలువురు పాల్గొన్నారు.
నిఘా నేత్రంతో
బతుకు భద్రం
ఎంపి వినోద్ కుమార్
ముకరంపుర (కరీంనగర్), జనవరి 8: నిఘా నేత్రాలు ఉంటే బతుకు భద్రంగా ఉంటుందని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బి.వినోద్ కుమార్ అన్నారు. నగరంలో 41వ డివిజన్ కమ్యూనిటి నిఘా నేత్రాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు కార్పోరేటర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ నేతృత్వంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కారమునకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు సామాజిక నిఘా నేత్రాలు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం శాంతిభధ్రతల పరిరక్షణకు ముందు నిలుస్తుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో 41వ డివిజన్‌లో 126 సిసి కెమెరాలు దాదాపు 21 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి బృహత్ కార్యక్రమంలో డివిజన్ ప్రజలను భాగస్వామ్యం చేయడం పట్ల కార్పోరేటర్ చొరవ చూపడాన్ని ప్రశంసించారు.