కరీంనగర్

రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జనవరి 15: ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆదివారం జిల్లా కేంద్రం నుండి బయలుదేరుతున్న సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. సిరిసిల్ల జిల్లా నుండి బాలబాలికలు 32 మందితో కూడిన టీం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 16,17 తేదీలలో పాల్గొంటున్నారన్నారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజ్ చేతుల మీదుగా క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందించారు. వీరికి కోచ్‌లుగా ఎం.రమేష్(సిరిసిల్ల), వీరస్వామి(మర్రిమడ్ల), బి.శిరిష(జిల్లెల్ల), పి.వౌనిక (చిన్నబోనాల)లు వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటి క్రీడాధికారి అనిల్‌కుమార్, పిడిలు రాందాస్, గొట్టె అంజయ్యలు పాల్గొన్నారు.

ఘనంగా రామలింగేశ్వర స్వామి
కల్యాణోత్సవం
ఇల్లంతకుంట, జనవరి 15: సంక్రాంతి పర్వదినాన పురస్కరించుకొని మండలంలోని జంగంరెడ్డిపల్లిలోని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజులు నిర్వహించారు. ఇందులో భాగంగానే శనివారం రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవం కనుల విందుగా జరిగింది. గజపల్లకిలో స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం బండ్ల ప్రదిక్షణ జరిగింది. ఈ బండ్ల ప్రదిక్షణలో మేకపోతుల బండి భక్తులకు మరింత ఆకట్టుకుంది. తదనంతరం రాత్రి జాతర కార్యక్రమంలో ధూం..్ధం.. కార్యక్రమం నిర్వహించారు. ఈ ధూం..్ధం..కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ధూం..్ధం..కళాకారులు జాతరలో ఉర్రూతలూగించారు. దీంతో జాతరలో భక్తులు ఉత్సాహంగా ఆదివారం రాత్రి పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం రథమహోత్సవం తదనంతరం ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.