కరీంనగర్

వరద కాలువకు నీరు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 16: ఎస్సారెస్పీ నుండి వరద కాలువకు తక్షణమే నీటి ని విడుదల చేసి చొప్పదండి నియోజకవర్గ రైతులకు నీరందించి ఆదుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎం పి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్‌అండ్‌బి అతిథి గృహ ంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద కాలువపైనే ఆధారపడి సాగుచేసే చొ ప్పదండి నియోకవర్గంలోని రైతులకు వరద కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వరద కాలు వ ద్వారా నీరివ్వాలని ఇప్పటికే పలుమార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమ న్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సారె స్పీ డెడ్‌స్టోరేజీలో ఉన్నా కూడా, అందు లో తెలంగాణ వ్యతిరేకి అయిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రై తులను ఆదుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ నిండుకుండలా ఉందని, అలాంటప్పుడు వరద కాలువకు నీటిని విడుదల చేయకపోవడ ంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతు సంక్షేమమే ధ్యేయమనే గొప్పలు చెప్పుకునే సిఎం కెసిఆర్‌కు చొప్పదండి రైతులు కనబడటం లేదా విమర్శించా రు. రైతులు హైదరాబాద్ వెళ్లి తమగోడును వివరించే ప్రయత్నం చేసిన మం త్రి, ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడం విచారకరమన్నారు. వరద కాలువకు నీరు వదిలితే జగిత్యాల, కరీ ంనగర్ జిల్లాలోని సుమారు 40వేల ఎ కరాలకు సాగునీరు అందుతుందనా నరు. స్థానిక ఎమ్మెల్యే బొడిగె శోభ వ రద కాలువకు నీటిని విడుదల చేసేందుకు కృషిచేయాలని కోరారు. రైతుల గోడును ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈనెల 23న తీవ్రమైన నిరసన, ఆందోళనలు చేపడతామని ప్రభాకర్ హెచ్చరి ంచారు. మాజీ మంత్రి సుద్దాల దేవ య్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న సమయం (2014-15)లో తాను టిడిపి ఎమ్మెల్యే గా ఉన్నప్పటికీ వరద కాలువకు నీటిని విడుదల చేయాలని కోరగా, నీటిని వి డుదల చేసి రైతులను ఆదుకున్నారని, అప్పుడు ఎస్సారెస్పీలో నీరు కూడా లే దన్నారు. ఇప్పుడు ఎస్సారెస్పీలో నీరు ఉన్నా, నీటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తుండటంతో చొప్పదండి ని యోజకవర్గ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారని, తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చొప్పదండి నియోజవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పద్మాకర్‌రెడ్డి, వైద రామానుజ ం, రాజేశ్వర్‌రెడ్డి, రాజిరెడ్డి, కోల రమేష్, నాగి శేఖర్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.