కరీంనగర్

హుజూరాబాద్ ఎస్‌బిఐలో షాక్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, ఏప్రిల్ 3: పట్టణంలో కరీంనగర్ రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం షాక్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బ్యాంక్‌ను మొదటి అంతస్తులో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. రెండో అంతస్తులో ఇన్సూరెన్సు కార్యాలయం ఉంది. ఇన్సూరెన్సు కార్యాలయానికి వచ్చిన గుర్రాల రమేష్ అనే ఎజెంట్ బ్యాంకు నుండి పొగలు రావడాన్ని, అలారం మోగడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వాహనంతో వచ్చి షెట్టర్లు తెరిచి వెంటనే మంటల్ని అదుపుచేశారు. హనుమకొండలో ఉన్న బ్యాంక్ మేనేజర్ అనిల్‌కుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంలో రెండు కంప్యూటర్లు, ఓ సర్వర్, ప్రింటర్, ఫర్నిచర్ దగ్దమయ్యాయి. మొత్తం రూ.5 లక్షల వరకు నష్ట ఉంటుందని అంచనా. ముందుగా ప్రమాదాన్ని పసిగట్టడంతో అస్తినష్టం తక్కువగా జరిగింది. లేకుంటే మంటలు విస్తరించి నష్టం ఎక్కువగా ఉండేది. ఎస్ బి ఐ లో అగ్ని ప్రమాద వార్త వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు.