కరీంనగర్

రుణాలు రెన్యువల్ చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామడుగు, జనవరి 17: రామడుగు సింగిల్‌విండో పరిధిలో పంట రుణాలు పొందిన రైతులు రెన్యూవల్ చేసుకోవాలని సంఘ కార్యదర్శి కె.మల్లేశం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు రెండు ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని తీసుకువచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకొని తమ రుణాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నారు. లేనియెడల ప్రభుత్వం నుండి వచ్చే మిగతా 25 శాతం రుణమాఫీ వర్తించదనే విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
సమష్టిగా పనిచేసి లక్ష్యాన్ని సాధించాలి
రామడుగు, జనవరి 17: ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వచ్చే 26వ తేదీ వర కు అందరం సమిష్టిగా కృషి చేసి ఐఎస్‌ఎల్ నిర్మాణం చేయించి మండలాన్ని ఆదర్శంగా తయారు చేద్దామని మండల ప్రత్యేకాధికారి డిఎంహెచ్‌ఓ రాజేశం పేర్కొన్నారు. మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామస్థాయి హౌ జ్ హోల్డర్స్ అధికారుల సమావేశం జరిగింది. ప్రత్యేకాధికారి మాట్లాడుతూ ప్రా రంభించిన నిర్మాణాలు పూర్తిచేయడానికి ప్రభుత్వం చేపట్టిన లక్ష్యం కోసం మం డల స్థాయి, గ్రామస్థాయి అధికారుల నియామకం పూర్తిచేశామన్నారు. లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను అనుమతి పొందాలన్నారు. అవసరమైన మెటీరియల్ ప్రభుత్వం నేరుగా మండల కేంద్రానికి సరఫరా చేస్తుందన్నారు. లబ్ధిదారులకు అ వగాహన కల్పించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటిసి వీర్ల కవిత, ఎండిఓ రాధారాణి, తహశీల్దార్ అహ్మద్ తదితరులు ఉన్నారు.
ఎలిగేడు ఎఇఓగా పూర్ణచందర్
ఎలిగేడు, జనవరి 17: ఎలిగేడు మండల కేంద్రాని కి చెందిన అడ్డగుంట పూర్ణచందర్ వ్యవసాయ విస్తర్ణ్ధాకారిగా (ఎఇఓ)గా ఎంపికయ్యారు. పూర్ణచంద ర్ 2011 వరకు రెండు సంవత్సరం అగ్రికల్చర్ డిప్లమాను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల యూనివర్శిటిలో చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టిఎస్‌పిఎస్‌సి ద్వారా 2016 ఏప్రిల్ 30న ఎఇఓ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో పూర్ణచందర్ 300 మార్కులకుగాను 200 మార్కులు ఓపెన్ కేటగిరీలో సాధించి ఎఇఓగా ఎంపికయ్యారు. పూర్ణచందర్ తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థులు ఎఇఓగా ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.