కరీంనగర్

పంచాయతీ కార్మికులకు వేతనాలు అమలుపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జనవరి 19: గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల వేతనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలుపర్చాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ అన్నారు. గురువారం స్థానిక గ్రామపంచాయతీ ఎదుట ఈనెల 29న సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో జరుగు తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ పెద్దపల్లి జిల్లా మొదటి మహాసభను జయప్రదం చే యాలని పిలుపునిచ్చారు. కార్మికులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కార్మికులకు ఇపిఎఫ్, ఇఎస్‌ఐ అమలుచేస్తూ వారిని రెగ్యులర్ చేయాలని, గుర్తింపుకార్డులు అందించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకా రం నెలకు రూ. 18 వేలు అమలుపర్చాలని, అలాగే ప్రతీ కార్మికునికి నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 29న జరుగు సభకు ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహన్, కె.రాంచంద్రంలు హాజరవుతారన్నారు.
విశ్వబ్రాహ్మణ సదస్సును విజయవంతం చేయాలి
చందుర్తి, జనవరి 19: ఈనెల 22న సిరిసిల్లలో జరిగే విశ్వబ్రహ్మణుల ఐక్యత సదస్సును విజయవంతం చేయాలని రుద్రంగి మండల విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు వెంకటేష్ అన్నారు. రుద్రంగిలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విశ్వబ్రహ్మణుల సమస్యలను పరిష్కరించేందుకు, మానసిక ఒత్తిడిపై సైకాలజిస్ట్‌చే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు రుద్రంగి మండలం నుండి పెద్దఎత్తున విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
సేంద్రియ ఎరువులపై రైతులు దృష్టిసారించాలి
* ఎంపిపి తిప్పని శ్రీనివాస్
చందుర్తి, జనవరి 19: రైతులు సేంద్రీయ ఎరువులపై దృష్టి సారించాలని ఎం పిపి తిప్పని శ్రీనివాస్ అన్నారు. మల్యాలలో చందుర్తి వ్యవసాయశాఖ అధ్వర్య ంలో సేంద్రీయ ఎరువులపై అవగాహన కల్పించారు. రైతులు రసాయనిక ఎరువులపై దృష్టిసారించకుండా సేంద్రీయ ఎరువులను వాడి అధిక దిగుబడులు పొందాలన్నారు. అనంతరం రైతు శిక్షణ కేంద్రం ఎడీఎ బర్కతుల్లా మాట్లాడుతూ అకు ఎరువు, పచ్చిరొట్టె ఎరువు లు వాడితే వ్యవసాయంలో అధిక దిగుబడులువస్తాయన్నారు.