కరీంనగర్

భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన డిటిఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలిగేడు, జనవరి 19: ఎలిగేడు మండల కేంద్రంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం గురువారం డిటిఓ వేముల సుదర్శన్ స్థలాన్ని పరిశీలించా రు. భవన నిర్మాణం కోసం ఉపాధిహామీ పథకం కింద రూ. 13 లక్షల 2015- 16కిగాను మంజూరయ్యాయన్నారు. చేనేత ఖాదీ సంఘం వెనుక 927 సర్వే నం బర్‌లోని ప్రభుత్వ భూమి ఖాళీస్థలాన్ని ట్రాక్టర్ బ్లేడుతో చదును చేస్తుండగా ప ద్మశాలి కులస్థులు అక్కడికి చేరుకొని ఈ స్థలం మాకు పట్టా ఉందని, ప్రభుత్వ భూమి కాదని అధికారులకు సూచించారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే చూ పంచాలని, లేనియెడల గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం ఐదు గుంటల భూమిని కేటాయిస్తామన్నారు. అలాగే సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ బం డి సుధాకర్, తహశీల్దార్ నాగరాజమ్మ, సర్పంఛ్‌లు మండిగ రాజనర్సయ్య, పెద్ది అనిత-సమ్మయ్య, పిఆర్‌ఎఇ శ్రీనివాస్, ఇఓపిఆర్‌డి వేణుగోపాల్‌రావు, ఆర్‌ఐ అహ్మద్, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్‌రావు, విఆర్‌ఓ మోజెస్ తదితరులు ఉన్నారు.
నిధుల దుర్వినియోగంపై చర్యకు వినతి
కోహెడ, జనవరి 19: మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ జగన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌లు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఫిర్యాదుపై రెండు నెలలుగా చర్యలు తీసుకోకపోవడంతో గురువారం జిల్లా పంచాయతీ అ ధికారికి గ్రామ యువకులు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిన నిధులు దుర్వినియోగమయ్యాయని గ్రామానికి చెం దిన తమ్మల శ్రీనివాస్ డిపిఓకు ఫిర్యాదు చేయడంతో గతనెల 18న విచారణ జరిపారు. ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపట్ల డిపిఓ సురేష్‌బాబును కలిసి త్వరితగతిన చర్యలు గైకొనాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పత్రి శ్రీనివాస్, యాదగిరి, ఖమ్మం వెంకటేశం, యువకులు శ్రీనివాస్, రమేష్, మహేష్, కరుణాకర్ తదితరులు ఉన్నారు.
పశువైద్య శిబిరానికి స్పందన
కోహెడ, జనవరి 19: మండలంలోని తంగళ్లపల్లిలో గురువారం మార్కెట్ కమి టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరానికి స్పందన లభించింది. 112 పశువులకు సాధారణ చికిత్సలు, 618 గొర్రెలు, మేకలకు ఉచిత మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ సైదుల రవీందర్, జడ్పీటిసి లక్ష్మణ్, నాయకులు ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గోన్నారు.