కరీంనగర్

మోదీకి హటావో.. దేశ్ కీ బచావో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 19: ప్రజలే నా దేవుళ్ళు.. వారి సంక్షేమమే నా జీవితలక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి పెద్దనోట్లు రద్దుచేసి వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టేసిన మోదీని సాగనంపి..దేశాన్ని రక్షించాలని మాజీ మంత్రి, టిపిసిసి ఉపాధ్యక్షుడు దుద్దిళ్ళ శ్రీ్ధర్‌బాబు పిలుపునిచ్చారు. పెద్దనోట్ల రద్దుతో మహిళలు పడుతున్న ఇబ్బందులపై జాతీయ మహిళాకాంగ్రెస్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట జిల్లా మ హిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలోనిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. నోట్ల రద్దుపై మోదీ ఇచ్చిన 50రోజుల గడువు ముగిసినా ఎలాంటి ఫలితం లే కపోవటంతో మహిళాలోకం మేల్కొందని, దీంతో పాలకుల గుండెల్లో గుబు లు మొదలైందన్నారు. మహిళలను క ట్టడి చేయటంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుతా వలు మల్లగుల్లాలు పడుతున్నాయని, క్యాష్‌లెస్ పథకంతోగ్రామీణ ప్రాం తాల్లో మహిళలెదుర్కొంటున్న సమస్యల పై ప్రశ్నించేందుకు వారు రోడ్లెక్కుతున్నారన్నారు. దేశ ఆర్దిక వ్యవస్థలో సమూలమార్పులు తెస్తానని ప్రకటించిన ప్రధాని, తనపార్టీ కార్యకర్తల ఆర్దికవ్యవస్థను మాత్రమే పెంచుతున్నాడని ఎద్దేవా చేశారు. నోట్లరద్దుపై తన కేబినేట్‌లోసైతం చర్చించకుండా, ఏకపక్ష నిర్ణయం తీసుకుని యావత్ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని దు య్యబట్టారు. పెద్దనోట్లు రద్దై నేటికి 110 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ బ్యాంకుల ఎదుట క్యూలు తప్పటంలేదని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతాంగం అనేక ఇక్కట్లకు గురువుతూ, యాసంగి పం టలు కూడా వేసుకోలేని దుస్థితి నెలకొందని వాపోయారు. వెనక్కితెచ్చిన నల్లధనాన్ని ఒక్కో ఖాతాదారుడికి రూ. 15 లక్షలు జమచేస్తానని, జనధన్‌ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15వేలు కూడా ఇప్పటివరకు జమచేయలేదని మండిపడ్డారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతోచిరువ్యాపారులు చితికిపోతే, అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మా రిందన్నారు. నోట్లరద్దుపై మొదట విరుచుకుపడ్డ ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత ప్రధాని మోదీకి వంతపాడటం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న సిఎం రెండున్నరేళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఓవైపుసంక్షేమపథకాలను సంక్షోభంలోకి నెడుతూనే, పతంగుల పండుగ నిర్వహించటమెందుకో బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పథకాలను తొక్కిపెట్టి, విద్యార్థులు,నిరుద్యోగులు,వృద్దుల బతుకులతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహించారు.
గ్రామీ ణ ఆర్దిక వ్యవస్థ కుంటుపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడటం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నోట్ల రద్దుతో ఎంతమేర నల్లధనం వెలికితీసారో ప్రకటించాలని డిమాండ్ చేశా రు. తాము వౌనంగా ఉంటే ఇంట్లోని బంగారానికి కూడా పన్ను చెల్లించాలనే భావనతోనే మహిళలంతా వీధుల్లోకొచ్చారని, ఇప్పటికైనా కేంద్రం కళ్ళుతెరిచి, నోట్ల రద్దు ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో భాగంగా స్థానిక తెలంగాణ చౌక్ నుంచి మహిళలు భారీసంఖ్యలో ర్యాలీగా వచ్చారు. ధర్నాలోఎమ్మెల్సీ సంతోష్‌కుమార్,టిపిసిసి అధికారప్రతినిధి రేగులపాటి రమ్యారావు, మహిళానాయకురాళ్ళు తాటిపర్తి విజయలక్ష్మి, జడ్పీటీసీ శోభారాణి,గర్యందుల మాన స, వైద్యుల శ్రీదేవి, నజీమా, సంగుప ద్మ, రాణిభాయ్, అంగోతు సుగుణ, కొ త్త రమాదేవి, పోలు రజిత, మారుపాక నిహారిక,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, మాజీ ఎమ్మె ల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు అ డ్లూరి లక్ష్మన్‌కుమార్, ప్యాట రమేశ్, చల్ల నారాయణరెడ్డి, ఒంటెల రత్నాకర్, ఆకుల ప్రకాశ్, బండ శంకర్, తదితరు లు పాల్గొన్నారు.

హక్కుల సాధనకై ఐక్య పోరాటాలు
* అంతర్జాతీయ మహాసభను విజయవంతం చేయండి
* ఐఎఫ్‌టియు జాతీయ కార్యదర్శి పటోలే

యైటింక్లయిన్‌కాలనీ, జనవరి 19: గని కార్మిక న్యాయమైన హక్కుల సాధనకై ఐక్య పోరాటాలు చేస్తామని ఐఎఫ్‌టియు జాతీయ కార్యదర్శి వికె.పటోలే అన్నారు. గురువారం యైటింక్లయిన్‌కాలనీ ప్రెస్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకై అనేక చట్టాలు చేయబడిన వాటిని అమలు పరచడంలో యాజమాన్యాలు మీమాంసలో ఉన్నాయన్నారు. కార్మిక సమస్యలు, వేతనాలు, రక్షణ, పర్యావరణంపై ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు గోదావరిఖనిలోని సింధూర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే అంతర్జాతీయ గని కార్మికు ల మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభను జాతీయ సనా నహాక కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. మహాసభకు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన బొగ్గు గని కార్మికులు, నాయకులు రానున్నారని తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం, మ నోరంజన్ మెహత, మల్లెపల్లి లక్ష్మ య్య, రాంచంద్రమూర్తి, ప్రొఫెసర్ హ రగోపాల్ తదితర మేధావులు మహాసభకు హాజరవుతారని తెలిపారు. 10 జాతీయ కార్మిక సంఘాలు ఐక్య కూటమిగా ఏర్పడి నిర్వహిస్తున్నటువంటి ఈ సభను కార్మికవర్గం అధిక సంఖ్య లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిఎల్‌బికెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, ఐఎఫ్‌టియు నాయకులు ఇ.నరేష్, అశోక్, విశ్వనాథ్, రాజేందర్ తదితరులు పా ల్గొన్నారు.