కరీంనగర్

రూ. 2.30 కోట్లతో సివిలాస్పత్రి మరమ్మతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 19: జిల్లాప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రూ.2.30 కోట్లతో మరమ్మత్తులు, ఆధునీకరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ సర్పరాజ్ అ హ్మద్ తెలిపారు. ప్రధానాస్పత్రిలో అవసరమున్న మరమ్మత్తులను ఆయన స్వ యంగా పరిశీలించారు. ఇటీవల జిల్లా మంత్రితోపాటు ఆస్పత్రిని సందర్శించినపుడు మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకురాగా, రూ. 80 లక్షలు మంజూ రు చేశారని వెల్లడించారు. మరమ్మత్తు పనులు టెండర్ దశలో ఉన్నాయని, పది రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని, ముందుగా క్యాజువాలిటీ వి భాగం ఏర్పాటు, రూప్ లీకేజీతోపాటు ఇతర మరమ్మత్తులు చేయనున్నట్లు పే ర్కొన్నారు వైద్యవిధానపరిషత్ ద్వారా ఆస్పత్రి మరమ్మత్తులకు రూ.1.50కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈనిధులతో ఆస్పత్రిలో ఏయే మరమ్మత్తులకు ప్రతిపాదనలు పెట్టాలో సందర్శించి తెల్సుకున్నామన్నారు. ఆస్పత్రిని ఆధునికంగా అభివృద్ది చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్ట ం చేశారు. రోగులను కలెక్టర్ పరామర్శించారు.

మానువాడ గ్రామానికి పరిహారం చెల్లిస్తాం
* కలెక్టర్ హామీతో ఆందోళన విరమించిన నిర్వాసితులు

బోయినిపల్లి, జనవరి 19: బోయినిపల్లి మండలం మానువాడ గ్రామాన్ని పూర్తిస్థాయిలో ముంపు గ్రామంగా గు ర్తించి పరిహారం చెల్లిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ్భాస్కర్ హా మీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో రెండు రోజులుగా చేస్తున్న ఆందోళనను గురువారం సాయంత్రం విరమించారు. మ ధ్యమానేరు జలాశయ నిర్మాణంలో 70 శాతం భూములు కోల్పోయిన మానువాడ గ్రామంలోని ఇళ్లకు పరిహారం చె ల్లించి పునరావాసం కల్పించాలన్న డి మాండ్‌తో బుధవారం నుండి కట్ట ని ర్మాణ పనులను అడ్డుకొని నిర్వాసితు లు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళ న తెలుసుకున్న రాష్ట్ర మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌లో సమస్య పరిష్కరించాలని సూచించారు. దీంతో జిల్లా కలెక్టర్ అక్కడి కాంట్రాక్టర్, ఇఇ అశోక్ కుమార్‌లను ఆందోళన కారుల వద్దకు పంపించారు. మీ సమస్య పరిష్కరిస్తామని ఇఇ అశోక్ కుమార్ తెలుపగా కలెక్టర్ వచ్చేంతవరకు ఆందోళన విరమించేది లేదని నిర్వాసితులు తెగే సి చెప్పారు. దీంతో నిర్వాసిత ప్రతినిధులతో కాంట్రాక్టర్, ఇఇలు కొద్దిసేపు చర్చలు జరిపారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామ ప్రతినిధులను సిరిసిల్లకు తీసుకురావాల్సిందిగా తెలుపడంతో ఇఇ గ్రామానికి చెందిన 15 మంది ప్రతినిధులను కలెక్టర్ వ ద్దకు తీసుకెళ్లారు. మానువాడ గ్రామా న్ని ముంపు గ్రామంగా గుర్తిస్తామని, పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల్లో గ్రామసభ నిర్వహించి అక్కడే అన్ని సమస్యలు చర్చిస్తామని తెలిపారు. దీంతో సంతృప్తి వ్యక్తం చేసి న నిర్వాసితులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ రామిడి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.