కరీంనగర్

కెసిఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 20: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బంగారు తెలంగా ణ చేస్తానని ఎన్నికల్లో అనేక హామీలి చ్చి వాటిని అమలుపర్చలేని కెసిఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడుతూ ముఖ్యమం త్రి కెసిఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చి ప్రకటనలతో తన మా టల గారడీతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాడని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని, పాలకులు ప్ర గల్భాలు పలుకుతున్నారని, అభివృద్ది అంటే మీరు అభివృద్ధి కావడం కాదు. ప్రజలు అభివృద్ధి చెందాలని, పేదల బ్ర తుకుల్లో మార్పు కనబడాలని అన్నా రు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి కావడ ం లేదని రీ-డిజైన్ల పేరుతో కాలయాప న ప్రజాధనం దుర్వినియోగం అవుతు ందని, ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న రైతులకు, పేదలకు ప్రభుత్వాలు ఇచ్చే నష్టపరిహారం విషయంలో 2013 సంవత్సరం భూసేకరణ చట్టాన్ని కాద ని, 2016లో చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం పూనుకోవడంవల్ల రైతులకు భూములపై హక్కు కోల్పోయే ప్రమా దం ఏర్పడిందని, ప్రభుత్వానికి హైకో ర్టు అడ్డుకట్ట వేసిందని, ప్రతీ విషయం లో కోర్టులు ప్రభుత్వానికి అడ్డుకట్ట వే స్తున్నప్పటికీ ప్రభుత్వానికి కొంచెం కూ డా సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఒక్క సిఎం దత్తత గ్రామాల్లో నిర్మిస్తే కాదని, రాష్టవ్య్రాప్తంగా పేదలకు ఇండ్లు మం జూరు చేసి నిర్మించిఇవ్వాలని, ఇందిర మ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలని, మిషన్ కాకతీయ పను ల్లో నాణ్యత లోపిస్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని, సంక్షేమ పథకాల అమలులో అనేక లొసుగులు ఉన్నాయని, ప్రభుత్వం పేదల పట్ల విముఖత చూపుతుందని చాడ ఆరోపించారు. కెసిఆర్ ఇప్పటికై నా ప్రజాసంక్షేమంపై, రాష్ట్భ్రావృద్ధిపై ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టకపోతే ప్రజాక్షేత్రంలో రానున్న రోజు ల్లో భంగపాటు తప్పదని తెలిపారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, జిల్లా కా ర్యవర్గ సభ్యులు కూన శోభారాణి, పొ నగంటి కేదారి, అందె స్వామి, గూడెం లక్ష్మి, పైడిపల్లి రాజు, పంజాల శ్రీనివా స్, ఎలగందుల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.