కరీంనగర్

27 నుండి సెటప్‌బాక్స్‌లున్నవారికే ప్రసారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జనవరి 20: కరీంనగర్ నగరంలో ఈనెల 27 నుండి సెటప్ బాక్స్‌లు ఉన్నవారికే కేబుల్ టివి ప్రసారాలు వస్తాయని జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కేబుల్ టివి ప్రసారాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జెసి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కేబుల్ టివి ప్రసారాల సిగ్నల్స్ జనవరి 26 వరకే వర్తిస్తాయని, 27 నుండి నిలిపివేయబడతాయని తెలిపారు. కేబుల్ టివి కనెక్షన్ ఉన్న వారందరు వెంటనే తమ కేబుల్ ఆపరేటర్లను సంప్రదించి సెటప్ బాక్స్‌లు అమర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఉపకార్య నిర్వాహక సమాచార ఇంజనీర్ వి.రాధాకిషన్, కమర్షియల్ టాక్స్ అధికారి సత్యనారాయణరావు, ఎపిఓ కొండల్‌రెడ్డి, శే్వత డిజిటల్ నెట్‌వర్క్ మేనేజర్ సత్యనారాయణలతోపాటు పలువురు పాల్గొన్నారు.

విద్యార్థులు లక్ష్యం కోసం శ్రమించాలి
రామడుగు, జనవరి 20: ప్రతీ వి ద్యార్థి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని అది సాధించేవరకు నిరంతరం కృషిచేయాలని కలెక్టర్ సర్ఫరాజ్ అ హ్మద్ పేర్కొన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు విద్యార్థులు శ్రద్ధగా వినాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఓటు దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కలి పంచారు. ఓటుహక్కు వజ్రాయుధం లాంటిదని, దీన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రతీ పౌరుడు అభివృద్ధిపై ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. 18 సం.లు నిండిన యువతీ, యువకులు తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చే సుకోవాలన్నారు. ఓటు ఆవశ్యకతపై ఇ తరులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. గం టకుపైగా విద్యార్థులతో గడిపిన కలెక్ట ర్ పలురకాల ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. రామడుగు గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న నాగి దివ్య తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని కలెక్టర్ కాళ్లపై పడి విలపించిం ది. స్పందించిన కలెక్టర్ వివరాలు సేకరించి తగిన న్యాయం చేస్తామని హా మీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటిసి వీర్ల కవిత, ఎంపిపి మార్కొండ కిష్టారె డ్డి, రామడుగు సింగిల్‌విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్‌రావు, తహశీల్దార్ ము జీబ్ అహ్మద్, ప్రిన్సిపాల్ వనజ తదితరులు ఉన్నారు.