కరీంనగర్

క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడ్డేపల్లి, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడాకారులకు తగిన వసతులను కల్పించి, క్రీడారంగ అభివృద్దికి కృతనిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ మంత్రి పద్మారావు అన్నారు. తెలంగాణ కబడ్డీ అసోషియేషన్ అధ్వర్యంలో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ పోటీలను హన్మకొండలోని ఇండోర్ స్టేడియంలో యువజన శాఖ మంత్రి పద్మారావు, అసోషియేషన్ చైర్మన్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలు ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కబడ్డీ కేవలం క్రీడ అనే భావన కంటే ఉద్వేగం, ఆసక్తి, సత్తాను వ్యక్తీకరించే వేదికగా ప్రత్యేకతను సంతరించుకుందని అన్నారు. తెలంగాణ ప్రజల హృదయాలకు దగ్గరగా మారిన కబడ్డీ, ప్రస్తుతం భారత దేశంలో కాక ప్రపంచస్థాయిలో ఆదరణ పొందుతున్న ఆట అని తెలిపారు. అంతర్జాతీయ కబడ్డీ వేదికపై భారతీయ కబడ్డీకి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి పద్మారావు గుర్తుచేశారు.
పర్యాటక రంగంతోనే సంస్కృతి విశ్వవ్యాప్తం* కెయు విసి సాయన్న
నక్కలగుట్ట, జనవరి 21: దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇతర దేశాలకు వ్యాపించాలంటే, అది పర్యాటక రంగంతోనే సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సాయన్న అన్నారు. శనివారం తెలంగాణ పర్యాటకశాఖ, కెయు పర్యాటకశాఖల అధ్వర్యంలో పిజి కళాశాలలోని జయశంకర్ సెమినార్ హాల్‌లో ఒకరోజు జాతీయ సదస్సు జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాయన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ది ప్రచారం అనే అంశంపై సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు పర్యాటక రంగాన్ని అభివృద్ది పరచి, దాని ద్వారా ఆర్థిక పరిపుష్టిగల దేశాలుగా ఎదిగాయని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ది చేస్తే, దేశంలోనే గొప్ప పర్యాటక క్షేత్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాబు నిథిమ్ డైరెక్టర్ ప్రొఫెసర్ చిన్నంరెడ్డి మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని అభివృద్ది పరిస్తే, దానితో అంతర్లీనంగా మన సంస్కృతి సంప్రదాయాలకు కూడా ప్రచారం కలుగుతుందని వివరించారు.