కరీంనగర్

గిట్టుబాటు ధర కోసం మార్కెట్ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్ధన్నపేట, జనవరి 21: రైతు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం రహదారిపై రైతులకు మార్కెట్ యార్డు మంచి అందుబాటులో ఉందని భవిష్యత్ దృష్ట్యా పక్కనే ఉన్న భూములను తీసుకొని యార్డును పెంచుకోవాలని సూచించారు. ఇప్పుడు ఉన్న గోడౌన్‌లకు అదనంగా మరికొన్ని షెడ్లు నిర్మించుకోవడానికి స్థల సేకరణ తప్పనిసరి అవసరం అన్నారు. ఎమ్మెల్యే అరూరి రమేష్, మార్కెట్ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డిలు తమకు వరి దాన్యం ఎండ బోసుకోవడానికి సిమెంట్ ప్లాట్‌ఫాంతో పాటు రైతు పంటల నిల్వ కోసం అదనంగా గోదాంలు మంజూరి చేయాలని మంత్రిని కోరడంతో ఆయన వాటికి సంబందించిన ప్రతిపాదనలు తనకు పంపాలని తెలిపారు. రైతు ఉత్పత్తుల గిట్టుబాటు ధరలకోసం మార్కెట్ యార్డు అభివృద్ధి తప్పనిసరి అని మంజూరి ఇస్తానని హామి ఇచ్చారు. కాని ప్రస్తుతం ఉన్న స్థలం భవిష్యత్ అభివృద్దికి సరిపోదని తక్షణమే స్థల సేకరణ చేసి ప్రతి పాదనలు ప్రభుత్వానికి పంపాలని ఆయన సూచించారు. పర్వతగిరి మండలంలోని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తల్లి మృతి చెందిన సందర్భంగా ఆయనను పలుకరించడానికి వస్తు దారిలో ఉన్న తమ మార్కెట్‌ను సందర్శించాలని కోరిన ఎమ్మెల్యే అరూరి రమేష్ కోరిక మేరకు వచ్చానని ఆయన అన్నారు. హరీష్ రావు వెంట మంత్రి మహేందర్‌రెడ్డి, సివిల్ సప్లయ్ శాఖ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి, శంకర్‌నాయక్‌లతో పాటు కూడా చైర్మన్ మర్రి యదవరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డిలు పాల్గొన్నారు.
22 మంది ఫీల్డ్
అసిస్టెంట్ల సస్పెన్షన్

వరంగల్, జనవరి 21: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని 22మంది ఫీల్ట్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేసారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఫీల్ట్ అసిస్టెంట్లు గ్రామీణ ప్రాంత ప్రజలకు 100రోజుల పని కల్పించవలసి ఉంటుంది. కానీ రూరల్ జిల్లాలోని 13మండలాలకు చెందిన 22మంది ఫీల్ట్ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా 100రోజులు పని కల్పించటంలో విఫలమయ్యారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాల నుంచి ఫిర్యాదులు అందటంతో విచారణ జరిపిన అనంతరం 22మంది ఫీల్ట్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసారు.
రూరల్ జిల్లా పరిధికి చెందిన పరకాల మండలం రాయపర్తి, కామారెడ్డిపల్లి, వెంకటాపూర్, వర్ధన్నపేట మండలం డిసి తండా, రెడ్డిపాలెం, ఉప్పరపల్లి, పర్వతగిరి మండలం కొనపాక, అనంతారం, నల్లబెల్లి మండలం మేడిపల్లి, ముచ్చింపుల, దుగ్గొండి మండలం మర్రిపల్లి, నాచినపల్లి, గీసుకొండ మండలం ఎలుకుర్తి, మనుగొండ, చెన్నారావుపేట మండలం జల్లి, ఉప్పరపల్లి, ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్, రాయపర్తి మండలం మహబూబ్‌నగర్, సంగెం మండలం కొత్తగూడెం, శాయంపేట మండలం పత్తిపాక, ఖానాపురం మండలం మంగళవారిపేట, నెక్కొండ మండలం పెద్దకోర్పుల గ్రామాలకు చెందిన ఫీల్ట్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసారు.