కరీంనగర్

పెద్దిని మాట్లాడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జనవరి 21: నర్సంపేటలోని పద్మశాలి గార్డెన్‌లో శనివారం జరిగిన కల్యాణలక్ష్మీ లబ్దిదారుల చెక్కుల పంపిణీలో అలజడి చోటు చేసుకుంది. సభాధ్యక్షత చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తొలుత రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం మహబూబాబాద్ ఎంపి అజ్మీరా సీతారాంనాయక్‌ను మాట్లాడాల్సిందిగా కోరారు. ఈక్రమంలో సమావేశంలో పాల్గొన్న టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫ్రొటోకాల్ పాటించాలని, పెద్దిని మాట్లాడించాలని నినాదాలు చేశారు. ఇదే సమయంలో సభా వేధికపైన ఉన్న నెక్కొండ ఎంపిపి గటిక అజయ్‌కుమార్ మాట్లాడుతూ సభావేదికపై జడ్పీటిసిలు, ఎంపిపిలు ఉన్నారని, తమ తరపున పెద్ది సుదర్శన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలన్నారు. దీంతో ఎంపి చేతిలో ఉన్న మైకును తీసుకున్న ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ఎంపి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేందుకు ఉన్నారని అన్నారు. దీంతో సభా వేదిక ముందు కొంత మంది కార్యకర్తలు దూసుకొచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ అయిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు సభా వేదిక ముందుకు వచ్చి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసమయంలో ఎంపి చేతిలో నుండి మైకు తీసుకున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి కల్యాణలక్ష్మీ లబ్దిదారులందరికి శుభాకాంక్షలని, అందరూ సమన్వయంతో ఉండాలని కోరారు. భావోద్వాగానికి గురైన పెద్ది తనకు అవమానాలను కొత్తేమి కాదని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. అందరూ సంయనం పాటించాలని, సంస్కారంతో ఉండాలంటూ పరోక్షంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి చురకలంటించారు.
గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి
* సిపి సుధీర్‌బాబు
నక్కలగుట్ట, జనవరి 21: క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలని వరంగల్ పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు అన్నారు. వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిథిలో రెండవ స్పోర్ట్స్ మీట్‌ను శనివారం సిపి సుధీర్‌బాబు సందర్శించారు. రెండవ రోజు జరిగిన కబడీ, వాలీబాల్ క్రీడలను సందర్శించి, క్రీడాకారులకు తగు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్చిలో మొదటి సారిగా వరంగల్‌లో రాష్టస్థ్రాయి పోలీసు క్రీడలను నిర్వహిస్తున్నామని, వాటిలో కమిషనరేట్ క్రీడాకారులు ప్రతిభను కనబరచాలని అన్నారు. అనంతరం టగ్ ఆఫ్ వార్ మీట్‌ను పోలీసులతో కలసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్‌పెక్టర్లు శ్రీనివాస్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.