కరీంనగర్

కాంగ్రెస్ జడ్పీటిసిల ఆందోళన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 21: జిల్లాపరిషత్‌లో సభ్యులైన జడ్పీటిసిలకు విధులు, నిధుల విషయంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీటిసిలు శనివారం జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి జిల్లాపరిషత్ కార్యాలయం ముందు బైఠాయించారు. జడ్పీటిసిలు తమ సమస్యలను సమావేశంలో ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో మీడియా ప్రతినిధులు చిత్రీకరించేందుకు ప్రయత్నించగా సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చిరాకుపడుతు మీడియా ప్రతినిధులను మీటింగ్ హాలు నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. దాంతో మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్లు సమావేశం నుంచి బయటకు వెళ్లవలసి వచ్చింది. దాంతో తమ సమస్యలను పట్టించుకోకపోవటంతోపాటు మీడియాను సమావేశం నుంచి బయటకు పంపించవేయటాన్ని నిరసిస్తూ ఉపముఖ్యమంత్రి కడియంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేసారు. మీడియా ప్రతినిధులు జిల్లాపరిషత్ మీటింగ్ హాలు బయట బైఠాయించి నినాదాలు చేయటంతో జిల్లాపరిషత్, పోలీసు అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మీడియా ప్రతినిధులు ససేమిరా అనటంతో సమావేశం కవరేజీ చేయటానికి ఉపముఖ్యమంత్రి అంగీకరించటంతో పరిస్థితి సద్ధుమణిగింది.
ఎర్రబెల్లికి పలువురు నేతల పరామర్శ
పర్వతగిరి, జనవరి 21: పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ కో ఆపరేటివ్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కుటుంబాన్ని శనివారం రాష్ట్ర మంత్రులు నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, రాష్ట్ర రోడ్డు రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పరామర్శించారు. ఎర్రబెల్లి ఆదిలక్ష్మీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పరామర్శలో సినినటుడు బాబు మోహన్, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సివిల్ సప్లయ్ రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి యోగానంద్, ఎంపి గరికపాటి మోహన్‌రావు, మున్సిపల్ చైర్మన్ ప్రేమలతరెడ్డిలు పరామర్శించారు.