కరీంనగర్

మార్చిలో చలో అసెంబ్లీ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, జనవరి 29: అనేక రంగాల్లో 25 లక్షలకు పైగా హమాలీ కార్మికులు పనులు చేస్తున్నారని, వారిపై అనుసరిస్తున్న విధానాలు, హక్కులకు నిరసనగా మార్చిలో చలో అసెంబ్లీ ముట్టడిని చేపట్టనున్నామని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు నరసింహన్ అన్నారు. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని బైపాస్‌రోడ్డులోగల సిమెంట్ గోదాం సమావేశ మందిరంలో జిల్లా సంఘం ముద్రించిన 2017 డైరీని ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కాల్వ నర్సయ్యయాదవ్‌తోకలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నరసింహన్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో సంఘటిత, అసంఘటిత కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తు ప్రకటనలకు పరిమితం అయ్యారని విమర్శించారు. కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలకు చిత్తశుద్ధిని నిరూపించుకొని వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డును ఏర్పాటు చేస్తే సిడబ్ల్యూసి గోదాంల్లో కొనసాగుతున్న హమాలీలకు కల్పించిన సౌకర్యాలు అందుతాయని ప్రభుత్వాని తెలిపారు. పలు సిమెంట్ కార్మాగాల యజమానులు వేలకోట్ల రూపాయలు ఆర్జిస్తుకనీస వేతనాలైనా చెల్లించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా యజమాన్యాలు కేవలం 18 రూపాయలైనా ప్రకటించి అందజేయాలని సూచించారు. విరమణ పొందిన కార్మికులకు మూడువేల రూపాయల పెనె్షన్ ప్రకటించి ఆదుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. రూ. 9 కోట్లు చొప్పున నిర్మాణ కార్మికులకు చట్టంలో ఉన్న విధంగా కేంద్రం ప్రకటించాలని, కేంద్ర కార్మిక సహాయ మంత్రి దత్తాత్రేయ ప్రకటనలకు పరిమితం కాకుండా ఆదుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి రవీంద్రన్, సిమెంట్ గోదాం అధ్యక్షులు తిరుపతియాదవ్, నాయకులు మీస కొమురన్న, సదానందం, శ్రీనివాస్, విష్ణు, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
నేడు సిరిసిల్లలో మార్కండేయ
రథోత్సవ
శోభాయాత్ర
సిరిసిల్ల, జనవరి 29: శ్రీశివభక్త మార్కండేయ స్వామి జయంతి మహోత్సవాలలో భాగంగా సోమవారం సిరిసిల్లలో ‘మార్కండేయస్వామి ర థోత్సవం శోభాయాత్ర’ ఘనం గా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జరిగే ఉత్సవాలలో రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు హాజరవుతున్నారు. ఇందుకోసం నిర్వాహకులు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూ ర్తిచేశారు. సోమవారం ఉదయం మార్కండేయ దేవస్థానంలో మహాయజ్ఞం, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం మ ధ్యాహ్నం 3.05 గంటలకు శ్రీశివభక్త మార్కండేయస్వామి రథోత్సవం శోభాయాత్ర పట్టణ పురవీధుల గుండా నిర్వహిస్తున్నట్టు పద్మశాలి సంఘం అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మినారాయణ, ప్రధా న కార్యదర్శి బూట్ల నవీన్‌కుమార్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్, ప్రధాన కార్యదర్శి గెంట్యాల శ్రీనివాస్, పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు కాముని వనిత, ప్రధాన కార్యదర్శి ఎనగందుల రూప ప్రకటనలో తెలిపారు.
తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలి
తిమ్మాపూర్, జనవరి 29: జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశలో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (రిటైర్డ్ ఐఎఎస్) రామచంద్రు తేజావత్ అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్‌లో గల జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం విదేశీ విద్య- ఉద్యోగం అనే అంశంపై ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, విశిష్ట అతిథిగా భ్యూక్యా జాన్సన్ (యుఎఎస్) హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ విదేశాల్లో చదువుకోవాలని ఆసక్తికలిగిన ఉండి, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారి కోసమే ఈ అవగాహన సదస్సు ఉపయోగపడుతుందన్నారు. మని మూలాల్ని మరిచి పోకుండా, తల్లిదండ్రుల ఆశల్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివిపైకి రావాలని అన్నారు. మొదట మనం ఏదైతే కావాలనుకుంటామో దాని కోసం అహర్నిశలు పరితపించాలని, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని, పరిశ్రమలు స్థాపించుకునే స్థాయికి ఎదగాలన్నారు. రాష్ట్ర ప్రభు త్వం బంజారా విద్యార్థుల విదేశీ విద్య కోసం పది లక్షల రూపాయల నుండి 20 లక్షల రూపాయలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల దగ్గరికి వెళ్లి వారిని ప్రశ్నలు అడుగుతూ వారి ప్రశ్నలకు జవాబులిచ్చారు. కష్టాలను గెలిచి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. గౌరవ అతిథి భూక్యా జాన్సన్ విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చా రు. యుఎస్‌ఎ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ చదువుకోవాలి, అక్కడే ఉద్యోగాలు చేయాలనుకొనే విద్యార్థులకు ఆయన సూచనలు చేశారు. జిఆర్‌ఈ, టోఫెల్, లోస్కోర్ల గురించి, నకిలీ యూనివర్సిటీల గురిం చి, హెచ్ 1,ఎఫ్ 1,యు 1, జె 1 వీసాల గురించి అపోహలను నివృత్తి చేస్తూ జవాబులిచ్చారు. విదేశాల్లో విద్య, ఉద్యోగం కోసం బ్యాంకు లోన్‌ల గు రించి, ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు. అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ విధానంతో భారతీయులకు ఏదైనా ఇబ్బంది ఉంటుందా ? అని ఓ విద్యార్థి వేసిన ప్రశ్నకు బదులిస్తూ ఎటువంటి ఇబ్బంది ఉండదని, వదంతులు నమ్మకుండా విద్యార్థులు నిజాలు తెలుసుకొని విదేశాలకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మ న్ జువ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ ఐఎఎస్, ఐపిఎస్ లాంటి మహోన్నత వ్యక్తులు తమ కళాశాల విద్యార్థులకు స్ఫూర్తినివ్వడం చాలా ఆనందమని, చిన్న ఉద్యోగమైనా మొదట అందులో చేరి తరువాత అనుకున్న గమ్యాన్ని అందుకోవాలని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఇండియన్ సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్ కో-ఆర్డినేటర్ కుడిధి శ్రీనివాస్, మీడియా ఇన్‌చార్జి విశ్వప్రకాశ్‌బాబు, హెచ్‌వోడిలు డాక్టర్ కొండా శ్రీనివాస్, డి.శ్యామ్‌ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్స్ రాధికరెడ్డి, జ్యోతిప్రభ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యఅతిథులకు కళాశాల చైర్మన్ సాగర్‌రావు శాలువాతో సత్కరించి, మెమోంటోను అందజేశారు.
సమష్టి కృషితోనే అభివృద్ధి

* అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్
కరీంనగర్ టౌన్, జనవరి 29: సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యపడు తుందని అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ అన్నారు. నగర వాసులకు సేవలందించేందుకు మూడున్నర దశాబ్దాల క్రితం ఆవిర్భవించిన అర్బన్ బ్యాంక్ ప్రాతినిత్యపుమహాజన సభ ఆదివారం నగరంలోని కృషిభవన్‌లోజరిగింది. కార్యవర్గ సభ్యుడు గొట్టె సత్యనారాయణ, సభ్యులు ముడుపు మోహన్, శ్రీనివాస్,పాపిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఉయ్యాల శ్రీనివాస్‌తో పాటు పలువురు మాట్లాడగా, పాలకవర్గ ఉపాధ్యక్షుడు దేశ వేదాద్రి, కార్యవర్గసభ్యులు సరిళ్ళ ప్రసాద్, బొమ్మరాతి సాయికృష్ణ, అనురాసు కుమార్, దూనిగుంట సంపత్, వరాల జ్యోతి,ముద్దసాని క్రాంతితో పాటు 200కు పైగా సభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పద్ధతి మారాల్సిందే

ఎన్నికల సంఘం సలహాదారు కెజెరావు
కరీంనగర్ టౌన్, జనవరి 29: మారుతున్న కాలానికనుగుణంగా దేశంలో ఎన్నికల నిర్వహణ తీరు కూడా మారాల్సిన అవసరముందని, దేశవ్యాప్తం గా ఒకేసారి ఎన్నికలు జరిపితే పాలన మరింత సులువవటంతో పాటు దేశ ఆర్థిక స్థితిగతులపై పెరిగే భారం కూడా తగ్గుతుందని ఎన్నికల సంఘం సలహాదారు కెజెరావు అన్నారు. ఒకే జాతి... ఒకే ఎన్నిక అనే అంశంపై ప్రజ్ఞ్భారతి జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లో నిర్వహిం చిన చర్చాగోష్టికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా ఏటా ఏదోరకమైన ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, దీంతో రెండు నెలల ముందు, వెనుకా పాలన కుంటుపడి, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం అనివార్యంగా మారిందన్నారు. గతంలో సాధారణ బడ్జెట్‌తోనే ఎన్నికలు పూరె్తైతే, నేడు వేలకోట్లు ఎన్నికల నిర్వహణ కోసమే ఖర్చుచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ఖర్చు రూ. 200 కోట్ల వరకు పరిమితి ఉండగా, 2014లో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రూ.40 వేల కోట్ల వరకు ఖర్చైనట్టు అంచనా వేసినట్టు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ కోసం యంత్రాంగాన్ని కేటాయించటంతో మాతృశాఖలో వారు నిర్వహణ విధులు అటకెక్కుతున్నాయని, విలువైన సమయం వృధా అవటంతో ఆవటంతో పాటు అ సాంఘిక శక్తుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయటం అభినందనీయమన్నారు. ఏటా 5 నుంచి 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగటం సాధారణంగా మారిన నేటి రోజుల్లో నిర్వహణ వ్యయం ఎన్నికల సంఘానికి తలకుమించి భారమవుతుండగా, దేశ ఆర్థికవ్యవస్థ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ నేపథ్యంలోరాజ్యాంగ సవరణ చేసుకుని దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించుకుంటే పరిపాలన సౌలభ్యంతో పాటు ఎన్నికల వ్యయం కూడా ప్రభుత్వానికి తగ్గుతుందన్నారు. ప్రజ్ఞ్భారతి జిల్లా అధ్యక్షుడు డా.ఎడవెల్లి విజయేంద్రరెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్య్రానంతరం నుంచి ఆరుదశాబ్దాల కాలంలో పాలకులు ఏనాడు ఎన్నికల నిర్వహణ వ్యయంపై దృష్టిసారించలేదని, గెలుపే లక్ష్యంగా ఖర్చు పెంచుతూ దేశ ఆర్దికస్థితి గతులను దిగజార్చారన్నారు. మూడు తరాలనుంచి కొనసాగుతున్న యాంత్రిక పాలనకు చరమగీతం పా డి, అభివృద్ధే లక్ష్యంగా కొనసాగించే పాలనకు దేశప్రజలు స్వాగతం పలికారన్నారు. దీనిని వమ్ముచేయకుండా దేశాన్ని అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కంకణబద్దులై, బూజుపట్టిన ప్రగతిని ప్రక్షాళన చేస్తున్నాడని కొనియాడారు. చర్చాగోష్టిలో ప్రజ్ఞ్భారతి జిల్లా ఇంచార్జి సిఏ నిరంజనాచారి, నాగేశ్వర్‌రావు, దామోదర్‌తో పాటు 280మందికి పైగా మేధావులు, ఔత్సాహికులు పాల్గొని, ఎన్నికల నిర్వహణ తీరుపై సలహాలు, సూచనలు అందజేశారు.

ప్రముఖ జాతీయ జానపద నృత్య
కళాకారుడు హఠాన్మరణం

కరీంనగర్, జనవరి 29: అనేక జానపద నృత్య ప్రదర్శనలిచ్చి పలు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు, బహుమతులు అందుకున్న జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు చెందిన ప్రముఖ జానపద నృత్య కళాకారుడు కోడూరి రవీందర్ గౌడ్ (57) ఆదివారం గుండెపోటుతో మృత్పిచెందాడు. వృత్తి రీత్యా రవీందర్ ఫార్మాసిస్ట్‌గా జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో పనిచేస్తున్నప్పటికీ ప్రవృత్తి రీత్యా జానపద నృత్య కళాకారుడు. ప్రభుత్వ పరంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనల ద్వారా మెప్పు పొందారు. అలాగే వివిధ కళా సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన పోటీల్లోనూ పాల్గొని జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు, బహుమతులు అందుకున్నారు. అంతేకాకుండా ఆయన తన నృత్య ప్రదర్శనల ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. 1989లో కాలికి గజ్జె కట్టిన రవీందర్ రెండు వేలకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ‘కోయ దొర’ నృత్య ప్రదర్శనద్వారా ఆయన అసమానప్రతిభను చాటుకున్నారు. ఆయన ప్రదర్శించే కోయ దొర నృత్యం ఎన్నిసార్లు తిలకించినా మళ్లీ మళ్లీ చూడాలన్పించే విధంగా ఉంటుంది. రవీందర్ అటు నృత్య ప్రదర్శనలిస్తూనే ఇటు ఎంతో మంది యువ కళాకారులకు ప్రోత్సాహన్ని అందించాడు. జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో పనిచేస్తున్న రవీందర్ మరో ఏడాదిలో పదవి విరమణ చేయనుండగా, రవీందర్ ఆదివారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. రవీందర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. రవీందర్ భౌతికకాయాన్ని సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించి నివాళులర్పించారు. అలాగే పలువురు రాజకీయ పార్టీల నాయకులు, చైతన్య కళాభారతి నాటక రంగ సంస్థ ప్రతినిధులతోపాటు పలు కళా సంస్థల ప్రతినిధులు, కళాకారులు రవీందర్‌కు ఘన నివాళులర్పించారు. రవీందర్ మృతి కళా రంగానికి తీరనిలోటని వారు పేర్కొన్నారు.