కరీంనగర్

గ్రామీణ నిరుద్యోగులకు ఉద్యోగకల్పనే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, ఏప్రిల్ 4: గ్రామాల్లో వేలాది మంది డిగ్రీలు, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్నారని, వీరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ హైస్కూలు మైదానంలో సోమవారం డిఆర్‌డిఏ టీసెర్ఫ్ ఈజీఎంఎం ల సంయుక్తంగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రారంభించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యల లక్షల్లో ఉందని, వీరందరకి ప్రభుత్వం ఉద్యోగావకాశాలు కల్పించలేదని అన్నారు. ప్రభుత్వ పరంగా కూడా కొన్ని పోస్టులకు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కోలతో పాటు టి పి ఎస్ సి ఇప్పటికే 30 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. త్వరలోనే టెట్ నిర్వహించి డి ఎస్సీ కూడా నిర్వహిస్తామని, పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని, పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వివరించారు. ప్రభుత్వంలో లక్ష ఉద్యోగాల వరకు భర్తీ చేస్తామని తెలిపారు. ఇంకా వేలాది మంది నైపుణ్యం ఉన్న వారికి ప్రయివేటు రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, అవసరమైతే నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకు కూడా ప్రభుత్వం శిక్షణ ఇస్తుందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోని పరిశ్రమలతో, విదేశీ కంపెనీలతో కూడా చర్చలు జరుగుతున్నాయని, వీలైతే నిరుద్యోగులను విదేశాలకు కూడా పంపే యత్నాలు చేస్తామని, ఒక్కో నిరుద్యోగిపై రూ. లక్ష ఖర్చు చేసేందుకు కూడా ప్రభుత్వ కృత నిశ్చయంతో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందకు యత్నిస్తోందని తెలిపారు. నిరుద్యోగులు కేవలం ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధిపై కూడా దృష్టి పెట్టాలని వారికి అవసరమైన రుణాలు కూడా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఇప్పిస్తుందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభించేవని, ప్రభుత్వ రంగంలో మంచి సత్తా ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని, కానీ ప్రయివేటు మోజులో పడి విపరీతమైన డబ్బులు ఖర్చుచేస్తూ నష్టపోతున్నారని ఈటెల అన్నారు. డి ఆర్ డి ఏ పిడి అరుణశ్రీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ జీ ఎం ఎం ద్వారా 1363 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగులకు లభించాయని తెలిపారు. పోలీసు ఉద్యోగాలకోసం కూడా పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆర్మీకోసం కూడా 500 మందికి శిక్షణ ఇచ్చామని ఇందులో 180 మంది ఎంపికయ్యారని తెలిపారు. హుజూరాబాద్‌లో జరిగిన జాబ్ మేళాకు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, 24 కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని, ఇందులో ఎక్కువ మంది ఎంపికయ్యేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పిడి అరుణశ్రీ, ఆర్ డి వో చంద్రశేఖర్, డి ఆర్ డి ఏ అడిషనల్ పి డి రమేష్ బాబు, హుజూరాబాద్, జమ్మికుంట నగర పంచాయతీ ఛైర్మన్లు వడ్లూరి విజయ్‌కుమార్, పోడేటి రామస్వామి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి
ఓదెల, ఏప్రిల్ 4: పాలిటెక్నిక్ పూర్తి చేసి ఇసెట్‌కు ప్రిపేర్ అవుతున్న మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పులిపాక అరుణ్ (20) అనే విద్యార్థి సోమవారం విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌లో ఇసెట్‌కు ప్రిపేర్ అవుతున్న అరుణ్ ఇంటి వద్ద చిన్న కార్యక్రమానికి వచ్చి రాత్రివేళ ఇంటిపైన నిద్రిస్తుండగా దాహం కోసం పై నుండి కిందికి దిగి నీళ్ల తాగడం కోసం రంజన్ వద్దకు రాగా పక్కకే ఉన్న డిష్ వైరుకు విద్యుత్ సరఫరా కాగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరుగుదొడ్ల స్కాంపై ఆర్డీవో విచారణ
గంభీరావుపేట, ఏప్రిల్ 4: నిర్మించకుండానే పెద్ద ఎత్తున బిల్లులు డ్రా చేసిన గంభీరావుపేట మండల కేంద్రంలోని మరుగుదొడ్ల స్కాంపై సిరిసిల్ల ఆర్డీవో భిక్షానాయక్ సోమవారం విచారణ జరిపారు. మండల కేంద్రంలో దాదాపు 834 మరుగుదొడ్లు నిర్మాణాలు జరిగినట్లు రూ. 93లక్షల నిధులు డ్రా చేశారు. మరుగుదొడ్డు నిర్మించకుండానే పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగినట్లు పంచాయతీకి చెందిన పలువురు వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ అవినీతి తతంగమంతా భయటపడింది. దీనిపై అధికారులు ఇంటిటా విచారణ జరిపి మరుగుదొడ్లు నిర్మించకుండానే నిధులు డ్రా చేసినట్లు అధికారుల విచారణ వెల్లడయింది. ఇందుకు భాద్యులుగా ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ రాజుకుమార్‌ను జిల్లా కలెక్టర్ పదిరోజుల క్రితం సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారిచేశారు. తదానంతరం కాంగ్రెస్‌కు చెందిన నాయకులు మండల కేంద్రంలో జరిగిన మరుగుదొడ్ల స్కాంపై హెచ్‌ఆర్‌సి, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలుచేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదించాలని హెచ్‌ఆర్‌సి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించగా కలెక్టర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల ఆర్డీవో మళ్లీ ఇంటింటా విచారణ జరిపారు. అబ్దిదారులు ఫిర్యాదు చేసిన ఆరోపణలను అధికారులు నమోదు చేసుకున్నారు. నమోదు నివేదికను జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్లు పేర్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేందర్, విఆర్వో రమేష్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

21న పాలిసెట్
ముకరంపుర (కరీంనగర్), ఏప్రిల్ 4: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రాజగోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ ఉత్తీర్ణులకు ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యావకాశాలు అపారంగా ఉన్నాయని, ఎస్‌ఎస్‌సి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తుకు చివరి తేది ఈ నెల 10. దరఖాస్తు రుసుము రూ.20, పరీక్ష రుసుము రూ.330, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.165 అని తెలిపారు.