కరీంనగర్

జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 10: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ 11వ తేదీ శనివారం ఉదయం 10-30 గంటలకు పెద్దపల్లి సబ్ కోర్టు ఆవరణంలో నిర్వహించనున్న జాతీ య లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి ఎం.కృష్ణమూర్తి కోరారు. సబ్ కోర్టులో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం సుప్రీం కోర్టు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి రాజేందర్, బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్ పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలి
లీగల్ (కరీంనగర్), ఫిబ్రవరి 10: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో శనివారం జరుగుతున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయస్థానం హాలులో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రేణుక మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టులలో పెండింగ్ కేసులు, కోర్టు దాకా వెళ్లని వివాదాలు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని ఆమె అన్నారు. చిన్న చిన్న నేరాలు క్రిమినల్ కేసులలో శాంతియుతంగా చర్చించి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని కక్షిదారులకు, బాధితులకు సూచించారు. వీటితో పాటు చెక్‌బౌన్స్, బ్యాంకింగ్, రోడ్డు ప్రమాదానికి గురైన కేసు లు, కుటుంబ తగాదాలు, కార్మిక కేసులు, సివిల్ కేసులను ఇరువర్గాలు సామరస్య పూర్వకంగా చర్చించుకొని రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాల న్నా రు. జిల్లాలో వివిధ కోర్టులలో ఇప్పటికే ఐదు వేలకు పైగా నోటీసులను బాధితులకు, కక్షిదారులకు పంపించామని, సాధ్యమైనంత మేరకు పరిష్కారం దిశ గా కృషి చేయాలన్నారు. పోలీస్ విభాగం, జిల్లా న్యాయసేవా అధికారసంస్థల సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో స్పందన బాగా ఉన్నట్లు తెలిసిందని ఆమె అన్నారు. ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు నేడు జరిగే జాతీయ లోక్‌అదాలత్ గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో వారి వారి రూపంలో అవగాహన కల్పించినందుకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.